
మే 2004 నుంచి ఆగస్ట్ 2008 వరకు మన్మోహన్ వద్ద మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రచించిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో విడుదలైన ఈ పుస్తకంలో… యూపీఏ సర్కార్ లో అత్యంత కీలకమైన నియామకాలు, నిర్ణయాలను ప్రధాని హోదాలో ఉన్న మన్మోహన్ బదులు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీసుకున్నారని పేర్కొన్నారు. దానికి తగిన విధంగానే తాజాగా విడుదల చేసిన పోస్టర్ డిజైన్ కనపడుతోంది.
అయితే నిజంగా జరిగింది జరిగినట్లుగా చూపించే సత్తా ఉందా? అన్నది మాత్రం ప్రశ్నార్ధకమే! మన్మోహన్ అనుకోకుండా ప్రధాని అయిన విషయం బహిర్గతమే. దానికేం పెద్ద సినిమా అవసరం లేదు. అలాగే మన్మోహన్ రూపం వెనుక సోనియాగాంధీ ఉన్నారని, అన్ని విషయాలలో సోనియాదే తుది నిర్ణయంగా సాగిందని అప్పట్లో ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోశాయి. నిజానికి ప్రతిపక్షాలు చెప్పకముందే ఈ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. మరి వాటన్నింటిని నిజంగా చూపించే దమ్ము ఉందా?
అదే జరిగితే… ఇండియాలో ఓ సంచలనమైన సినిమాగా ఈ “ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్” సినిమా నిలిచిపోవడం ఖాయం. అంత సాహాసాన్ని చిత్ర నిర్మాత సునీల్ బోహ్రా చేస్తారో లేదో చూడాలి. 2019 సాధారణ ఎన్నికలకు ముందుగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రణాలికలను సిద్ధం చేసుకుంటున్నామని, రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన ‘గాంధీ’ సినిమా కంటే ఇంకా గొప్పగా ఈ సినిమా ఉంటుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే మన్మోహన్ హాయంలోనే ఎక్కువ కుంభకోణాలు జరగడంతో… ఆ నిజాలన్నీ బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…