Telugu

వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆఫీసులోనే చోరీ

చంద్రబాబు అధికారంలో ఉండగా అనేక కేసులతో అప్పటి ప్రభుత్వానికి ఇరుకున పెట్టే ప్రయత్నం చేసేవారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. ఆ తరువాత చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ ని ఓడించి జైంట్ కిల్లర్ గా అవతరించారు ఆయన. గెలిచాకా చంద్రబాబు ఉండవల్లి ఇంటిని కూలగొట్టాలని పోరాటం చేస్తున్నారు.

అటువంటి ఆళ్ల రామకృష్ణ రెడ్డికి ఝలక్ తగిలింది. మంగళగిరి ఆయన ఆఫీసులో 10 లక్షల చోరీ జరిగింది. అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు. సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఆ డబ్బును ఆఫీసులో ఉంచినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

డబ్బు చోరీపై వైఎస్సార్‌సీపీ నేత జూపూడి జాన్సన్‌ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. కంప్లయింట్ తో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆఫీసులో పని చేసే వారి పనేనా అనే కోణంలో వారు విచారణ జరుపుతున్నారు.

ఈ క్రమంలో అనుమాతుడిగా గుర్తించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని నుంచి పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. తొందరలోనే దొంగను పట్టుకుని పోయిన సొమ్ముని రికవర్ చేస్తామని అంటున్నారు. అయితే రాష్ట్రంలో పోలీసులను ప్రతిపక్ష నేతల పై దొంగ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తుండడంతో ఎమ్మెల్యేలకు కూడా భద్రత లేకుండా పోయిందని టీడీపీ వారు ఆక్షేపిస్తున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

క్యాడర్ కుస్తీలు…అధినేతల భేటీలు

స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇన్నేళ్ల స్నేహాన్ని విరోధంగా మార్చేసింది. ఇరు పార్టీల మధ్య…

22 minutes ago

CSK Star Ruled Out for 3 Months: IPL 2027 in Doubt?

Chennai Super Kings (CSK) have suffered a setback ahead of IPL 2027, as Ayush Mhatre…

34 minutes ago