Telugu

సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి ఇంట్లో దొంగలు!

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో వైరంగా ‘బిగ్ బాస్’కు ఎదురు ‘లేడీ బాస్’ను దింపి విజయబావుట ఎగురవేసిన ‘కర్తవ్యం’ విజయశాంతి ఇంట్లో దొంగలు పడ్డారు. టాలీవుడ్ లో అగ్ర నటిగా ఎదిగి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో దొంగలు పడడం కలకలం సృష్టించింది. విలువైన బంగారు నగలను ఎత్తుకెళ్లారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ చోరీని గమనించిన విజయశాంతి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తన ఇంటిలోకి చొరబడ్డ దొంగలు విలువైన నగలను ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎంపీ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు చోరుల కోసం గాలింపు మొదలుపెట్టారు. అయితే చోరీకి గురైన నగల విలువ ఎంతన్న విషయం తెలియరాలేదు. మొన్నటిదాకా టీఆర్ఎస్ లో ఉన్న విజయశాంతి, మెదక్ ఎంపీగా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీఆర్ఎస్ తో విభేదాల నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

Indian Arrested for Sexually Assaulting Teen Girl

Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…

3 hours ago

Jagame Sangeetham Review: Superficial Remake, A Major Misfire

BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…

3 hours ago