
‘మనం పుట్టినపుడు మనవాళ్ళందరూ ఆనందపడతారు… అది మనకు తెలియదు…. మనం దూరమైనపుడు మనవాళ్ళందరూ బాధపడతారు… అది మనకు తెలియదు… మనకు తెలిసి మనం సంతోషంగా ఉండి, మనవాళ్ళందరూ సంతోషంగా ఉండేది ఒక్క పెళ్లిలో మాత్రమే, అలాంటి పెళ్లి గొప్పతనం గురించి చెప్పే ఓ చిరు ప్రయత్నమే మా శ్రీనివాస కళ్యాణం”గా ఈ టీజర్ ను పేర్కొన్నారు.
సినిమా కాన్సెప్ట్ ఏంటో ప్రేక్షకులను చేరవేయడంలో ఈ టీజర్ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా సహజనటి జయసుధ చేత బ్యాక్ గ్రౌండ్ వాయిస్ చెప్పించడం హైలైట్ గా నిలిచింది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ఆడియో జూలై 22వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఈ టీజర్ ద్వారా స్పష్టం చేసారు. ఇప్పటికే విడుదలైన ఒక మిక్కీ స్వరం సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
Tamil cinema has found an extremely talented youngster in the form of Pradeep Ranganathan, who…
Varsha Rekhate is turning a sunlit tropical escape into her personal fashion runway. A punchy…