Telugu

‘బాహుబలి’ రికార్డులు బద్దలు కావడం ప్రారంభం!

‘బాహుబలి’ సినిమా ద్వారా రాజమౌళి సృష్టించిన రికార్డులు ప్రారంభమైంది ఆ సినిమా ట్రైలర్ తో. విడుదల చేసిన 24 గంటల లోపే దాదాపు 1.4 మిలియన్ క్లిక్స్ ను అందుకున్న ‘బాహుబలి’ రికార్డులను తాకడం ఏ సినిమా వల్ల కూడా కాలేదు. అయితే తాజాగా తమిళంలో విజయ్ హీరోగా విడుదలైన “తేరి” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త చరిత్రను లిఖిస్తోంది.

‘బాహుబలి’ రికార్డులను కేవలం 21 గంటల్లోనే బద్దలు కొట్టిన “తేరి” యూట్యూబ్ క్లిక్స్ దాదాపుగా 2 మిలియన్ దిశగా పరిగెడుతున్నాయి. విజయ్, సమంత జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ‘బాహుబలి’ రికార్డు సైతం చిన్నబోయింది. ట్రైలర్ తో ప్రారంభమైన రికార్డులు తర్వాత కూడా కొనసాగుతాయో లేదో తెలుసుకోవాలంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

ADVERTISEMENT

మరోవైపు తెలుగులో కూడా ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టే సినిమాగా ప్రచారం జరిగిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ట్రైలర్ ను యూ ట్యూబ్ లో పెట్టడానికే దాదాపుగా 20 గంటల సమయం తీసుకున్నారు. ఆడియో వేడుకపై విడుదలైన ట్రైలర్ పట్ల ప్రేక్షకులు పెదవి విరచడంతో, సరికొత్త ట్రైలర్ కటింగ్ లో చిత్ర యూనిట్ నిమగ్నమైందన్న టాక్ వెలువడింది. అయితే తాజాగా అదే ట్రైలర్ యూట్యూబ్ లో అప్ లోడ్ కావడంతో ‘సర్ధార్’ రికార్డులకు అవకాశం లేకుండా పోయింది.

Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

Sardar 2: Can Karthi Survive the Deadly Mandaadi Clash?

Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…

20 minutes ago

Akshay Kumar’s KBC Blunder: Did He Forget Prithviraj?

Akshay Kumar is facing criticism on social media after an unexpected moment on Kaun Banega…

50 minutes ago