Telugu

రీల్స్ పిచ్చి ఎంతగా ముదిరిపోయిందంటే

దేశంలో రీల్స్ పిచ్చి ఎంతగా ముదిరిపోయిందంటే… రీల్స్ కోసం ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ఒకే వ్యక్తిని వివాహం చేసుకునే అంత!

యూపీలోని ఆమ్రోహా జిల్లాలోని ధౌరియా గ్రామానికి చెందిన ఆల్క, దేవిక, సంతోష్ ముగ్గురూ అక్కాచెల్లెళ్ళు. నిత్యం రీల్స్ చేసే వారి ముగ్గురికీ సోషల్ మీడియాలో చాలా ఫాలోవర్స్ ఉన్నారు.

ADVERTISEMENT

జీవితంలో ఇంత గుర్తింపు, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వారు ముగ్గురూ తమతో కలిసి పనిచేసే కెమెరా మ్యాన్ వికాస్‌ని పెళ్ళి చేసుకోవడంతో ఇప్పుడు వారి పేర్లు యావత్ దేశంలో మారుమ్రోగిపోతున్నాయి.

సోషల్ మీడియాలో ఇంత పాపులర్ అయిన తాము పెళ్ళిళ్ళు చేసుకొని దూరమైతే ఇక ఎన్నటికీ రీల్స్ చేయలేమని కనుక తమలాగే ముగ్గురు అన్నదమ్ములని పెళ్ళి చేసుకుంటే కలిసి ఉండవచ్చని అనుకున్నారు. కానీ అది సాధ్యపడకపోవడంతో వారు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అనేక వీడియోలలో తమ భర్తగా కూడా నటించిన కెమెరా మ్యాన్ వికాస్‌నే ముగ్గురూ పెళ్ళి చేసుకుంటే ఇక నలుగురు కలిసి జీవిస్తూ రీల్స్ చేసుకోవచ్చని అనుకున్నారు. వారి ముగ్గురితో అతనికి మంచి అనుబంధమే ఉంది. వారి ఆలోచన కూడా నచ్చింది.

కనుక తమ నలుగురుకీ పెళ్ళి చేయమని పెద్దలను అడిగారు. మొదట వారు షాక్ అయ్యారు తేరుకున్నాక కుదరదని చెప్పారు. తల్లితండ్రులే కాదు గ్రామస్తులు కూడా వారి పెళ్ళికి ఒప్పుకోలేదు.

దాంతో నలుగురూ రహస్యంగా గుళ్ళో పెళ్ళి చేసుకొని, ఆ ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొదట తల్లితండ్రులు, గ్రామస్తులే షాక్ అయ్యారు. కానీ ఇప్పుడు వారి పెళ్ళి ఫోటో, వీడియో చూసి యావత్ దేశ ప్రజలు షాక్ అవుతున్నారు.

వారు నలుగురూ రీల్స్‌ చేస్తూ చేస్తూ చివరికి తమ జీవితాలనే రీల్స్‌గా మార్చేసుకున్నారు. వారి పెళ్ళికి ఎన్ని లైకులు, కామెంట్స్ వస్తాయో గానీ తప్పకుండా ఇంటికి పోలీసులు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వారిపై కేసు నమోదు అయితే అప్పుడు కోర్టు డ్రామా కూడా రక్తి కడుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ప్రతిపక్షాలకు మాత్రమే: గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత…ఓడితే ప్రభుత్వ దౌర్జన్యం…

స్థానిక ఎన్నికల సమరానికి పార్టీ క్యాడర్, లీడర్ లకు కూటమి ప్రభుత్వం మీద యుద్ధం చెయ్యాల్సిందే అంటూ తేల్చి చెప్పిన…

14 minutes ago

Nani’s The Paradise: Is an A Certificate Waiting?

Nani’s The Paradise is heading towards a September 24 release with a 2 hour 49…

17 minutes ago