
పురుషులకు మాత్రమే ఉద్దేశించిన ఈ సెలూన్ ఎయిర్ కండిషన్డ్ అని, వచ్చే ఏప్రిల్, మే మధ్యలో దీనిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ బ్యూటీ సెలూన్ లో హెయిర్ కట్, హెయిర్ డయింగ్, షేవింగ్, స్పా, ఫేసియల్, పెడిక్యూర్, మేనిక్యూర్, ఫుట్ మసాజ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సీనియర్ సిటిజన్లు, అల్జీమర్స్, మధుమేహ తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రత్యేక సేవలు అందిస్తామని, తక్కువ ధరకే తమ బ్యూటీ సెలూన్ లో సేవలు పొందవచ్చని సంతోష్ పేర్కొన్నారు.
తిరువనంతపురంలోని కన్నూరులో ‘ఫినిక్స్ ఫ్రీడమ్ ఎక్స్ ప్రెషన్స్’ పేరుతో ఈ తరహా బ్యూటీ సెలూన్ ఇటీవల ప్రారంభించారని, తమది రెండోదని, శిక్ష పూర్తయిన ఖైదీలు బయటకు వెళ్లిన తర్వాత ఈ రంగంలో ఉపాధి పొందవచ్చనే ఉద్దేశంతో బ్యూటిఫికేషన్ కోర్సులో శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. తిరువనంతపురంలోని రెండు పాలిటెక్నిక్ కళాశాలలలో ఈ కోర్సుకు సంబంధించిన శిక్షణను ఖైదీలు తీసుకుంటున్నారని సంతోష్ తెలిపారు.
Hemanth, the accused in the Raptadu school attack, was shot by the police after allegedly…
Riya Suman knows how to make golden hour look like her own fashion runway. Against…