
టీజర్ మొదలుకుని ఆసక్తికరంగా మారిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేయగా, సినిమాలో తామేం చూపించబోతున్నాము అనే విషయాన్ని స్పష్టంగా ట్రైలర్ లో చూపించి కధపై ఆసక్తి పెంచారు. భూమి మీదకు రాబోతున్న ఒక ఉల్కను సైంటిస్టులతో కలిసి ఓ మెజీషియన్ కుటుంబం ఎలా అడ్డుకుంది? అనేది చిత్ర ప్రధాన కధ. మెజీషియన్ గా ‘జయం’ రవి నటించగా, యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యేలా కనపడుతోంది.
‘బిచ్చగాడు’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాణ సంస్థే ఈ సినిమాను కూడా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. మేకింగ్ పరంగా మంచి ప్రొడక్షన్ వాల్యూస్, కధకు తగ్గట్లుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్., నటీనటుల హావభావాలు…. ఇలా ట్రైలర్ అయితే సినిమాపై గట్టి నమ్మకాన్ని ఇచ్చింది. ‘ఫస్ట్ ఇండియన్ స్పేస్ ఫిల్మ్’గా కొనియాడుతున్న ఈ సినిమా మరోసారి దక్షిణాది సినిమా ఇండస్ట్రీని హైలైట్ చేస్తుందేమో చూడాలి.
There is a strong sense of mythology and divine energy running through the teaser of Kurmaavatar,…
Ravi Teja is coming off the success of Irumudi, and it looks like the actor…