
కూటమి ప్రభుత్వం రాకతో గత ప్రభుత్వ పాలనలో టీటీడీ లో జరిగిన ఎన్నో అక్రమాలు, అవకతవకలు, అవినీతి కుట్రలు ఒకొక్కటిగా బట్టబయలవుతున్నాయి. అందులో మరి ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వెంకన్న లడ్డు ప్రసాదం లో జరిగిన నెయ్యి కల్తీ అంశం.
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రంగా కొలువబడే తిరుమల తిరుపతి శ్రీవారి ల్డడు ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో అప్పట్లో ఆ అంశం కాస్త దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
అయితే దీని మీద విచారణకు ఆదేశించిన ప్రభుత్వం అందుకు తగ్గ ఆధారాలను సేకరించే పనిలో పండింది, అలాగే ప్రభుత్వ వాదనలకు తగ్గ ఆధారాలను అధికారులు ద్రువీకరించి నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవం అంటూ నిర్దారించారు.
అలాగే తిరుమల శ్రీవారి హుండీ ప్రసాదం నుంచి నగదు చోరీ జరిగినట్టు ఆధారాలు వెలుగులోకి రావడంతో ఈ అంశం పై కూడా ప్రభుత్వం కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. అయితే ఈ అంశంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న టీటీడీ ఉద్యోగి రవి కుమార్ ఆస్తుల పై విచారణ కొనసాగించాలంటూ నేడు హై కోర్ట్ కీలక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఇప్పుడు తాజాగా తిరుమలలో మరో కుంభకోణం గుట్టు రట్టయ్యింది. తిరుమల తిరుపతిలో వేద ఆశీర్వాదం పొందే ప్రముఖలను సత్కరిస్తూ వారికీ అందించే పట్టువస్త్రం కొనుగోలులో భారీ స్కాం జరిగినట్టు టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
100 రూ . విలువ కూడా చేయని ఒక పాలిస్టర్ వస్త్రాన్ని పట్టు వస్త్రం అని దాని ధర 1400 రూ. అని సుమారు 54 కోట్ల రూపాయిలు శ్రీవారి ఆదాయాన్ని అక్రమంగా చోరీ చేసినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అయితే ఈ స్కాం లో నగరికి చెందిన VRS ఎక్స్ పోర్ట్స్ కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఒక పవిత్ర పుణ్య క్షేత్రంగా, కలియుగ దైవంగా కొలవబడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గత పాలకులు ఒక ఆదాయ మార్గంగా, అవినీతి కి అడ్డాగా, అక్రమాల నిలయంగా, చోరీలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మార్చుకుని ఇలా స్కాములతో, దోపిడీలతో తిరుమల పరువు తీయడంతో పాటుగా హిందువుల మనోభావాలను కూడా దెబ్బ తీశారు.
అయితే టీటీడీ లో ఈ విధమైన ఘోర పాపాలు, మోసాలు బయటకొస్తున్నప్పటికీ వైసీపీ అధినేత వైస్ జగన్ మాత్రం లడ్డు ప్రసాదంలో నెయ్యి కల్తీ అంటే…అదేదో గుడిలో లడ్డు అంటారు అని, పరకమణి లో చోరీ అంటే…ఇదేదో చిన్న దొంగతాన్ని పట్టుకుని రాజకీయ చేస్తున్నారని ఒక వర్గం ప్రజల నమ్మకాలను, విశ్వాసాలను కించపరిచేలా, అవమానించేలా అక్రమదారులను వెనకేసుకొస్తున్నారు.
అయితే ప్రభుత్వం ఇలా టీటీడీ ఒక్కో అంశంలో జరిగిన అవినీతిని బయటకు తేవడంమే కాదు ఆ అక్రమదారులకు, చోరీ వ్యక్తులకు, అవినీతి బకాసురులకు కఠిన శిక్షలు విధించి మరొకరికి ఇటువంటి ఆలోచన రాకుండా చూడాలని శ్రీవారి భక్తుల కోరుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా వేగంగా అడుగులు వేయాలని ఆశిద్దాం.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…