నేడు తెలంగాణలో… రేపు ఏపీలో… అధికారుల పరిస్థితి ఇదే!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ కేసులో పలువురు సీనియర్ పోలీస్ అధికారులు, మాజీ అధికారులు అరెస్ట్ అయ్యారు. వారి చేత ఆ తప్పులు చేయించిన మాజీ సిఎం కేసీఆర్‌, వాటితో తనకు ఎటువంటి సంబందమూ లేదని, వారి తప్పులకు వారే బాధ్యులవుతారని సింపుల్‌గా చేతులు దులిపేసుకున్నారు.

కేసీఆర్‌ తమను కాపాడుతారని అనుకుంటే, ఆయన ఈవిదంగా తప్పించుకోవడంతో ఈ కేసులో అరెస్ట్ అయిన అధికారులు కూడా కేసీఆర్‌ చేసిన పాపాలను బయటపెడుతున్నారు.

ADVERTISEMENT

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్ రావు, సిట్ బృందానికి ఇచ్చిన వాగ్మూలంలో కేసీఆర్‌ తమ చేత చేయించిన పాపాలు, నేరాలను బయటపెట్టారు.

కేసీఆర్‌ ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు తమ సొంత పార్టీలో పలువురు ముఖ్య నేతల ఫోన్లు కూడా తమ చేత ట్యాపింగ్ చేయించారని పేర్కొన్నారు.

లిక్కర్ స్కామ్‌లో చిక్కుకున్న కూతురు కవితని విడిపించుకోవాలని కేసీఆర్‌ వేసిన ప్లాన్ గురించి కూడా ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

ఆ పాపాలు, నేరాల గురించి చెప్పుకోవాలంటే అదో పెద్ద కధ అవుతుంది. కనుక వాటిని పక్కన పెట్టి తెలంగాణలో ప్రభుత్వం మారక జరిగిన ఈ పరిణామాలను చూస్తే, రేపు ఏపీలో ప్రభుత్వం మారినప్పుడు కూడా సరిగ్గా ఇలాగే జరుగబోతోందని అర్దమవుతుంది.

ఈ 5 ఏళ్ళలోనే సీఎస్ జవహార్ రెడ్డితో సహా పలుశాఖల ముఖ్యకార్యదర్శులు హైకోర్టులో హాజరై మొట్టికాయలు వేయించుకున్నారు. అయినా జగన్‌ స్వయంగా అనేక తప్పులు చేశారు. ఆయన మాట కాదనే ధైర్యం లేక కొందరు అధికారులు కూడా ఆ తప్పుడు నిర్ణయాలను అమలుచేశారు.

కనుక రేపు ప్రభుత్వం మారిన తర్వాత వారిపై కేసులు నమోడైతే జగన్‌ వచ్చి వారిని కాపాడరు. కాపాడలేరు కూడా. ఇప్పుడు కేసీఆర్‌ చెప్పిన్నట్లే వారి తప్పులకు వారే బాధ్యత వహించాలని చెప్పి చేతులు దులుపుకుంటారు. అప్పుడు వారు కూడా జగన్‌ స్వయంగా చేసినవి, తమ చేత చేయించిన నేరాలు, పాపాల జాబితాని బయటపెట్టక మానరు.

కనుక ఒకవేళ తెలంగాణలో కేసీఆర్‌ తదితరులు ఈ కేసులో అరెస్ట్ అయితే, అదే విదంగా రేపు ఏపీలో జగన్‌ తదితరులు కూడా అరెస్ట్ కాకుండా ఉంటారా?

అయితే జగన్‌ ప్రభుత్వం ఇంకా అధికారంలో నుంచి దిగిపోక ముందే ఇంతకాలం తమ కనుసన్నలలో పనిచేసిన ఏపీ పోలీస్ అధికారులను మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపి నేతలు నిందిస్తున్నారు. అలాగే జగన్‌ సృష్టించిన వాలంటీర్లను కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతగా బెదిరించారో అందరికీ తెలుసు.

తాజాగా ఏపీ సీఎస్ జవహార్ రెడ్డి భోగాపురంలో అసైన్డ్ భూములు కొముగోలు చేశారని ఆరోపణలు వచ్చినప్పుడు, వైసీపిలో ఏ ఒక్కరూ ఆయనకు మద్దతుగా ఒక్క ముక్క మాట్లాడలేదు.

ఈ మూడు ఉదాహరణలను గమనిస్తే వైసీపి నేతలు అప్పుడే చేతులు కడిగేసుకుంటున్నారని స్పష్టం అవుతోంది. కనుక రేపు అధికారం కోల్పోతే, వైసీపి నేతల కోసం తప్పులు చేసిన ప్రతీ అధికారి మూల్యం చెల్లించక తప్పదు. అప్పుడు వారిని ఆదుకునే వారే ఉండరు.

Share
Jhansi

Jhansi is a senior writer with extensive experience covering Telugu movies and the broader Indian cinema landscape. With a keen focus on U.S. updates related to Telugu people and Indians, as well as immigration & …

Published by

Recent Posts

Vangaveeti Radha Joins Jana Sena Ahead of AP Local Body Elections

Vijayawada leader Vangaveeti Radha Krishna has joined the Jana Sena Party after leaving the Telugu…

15 minutes ago

BSS Haindava Teaser: Breathtakingly Spectacular

Haindava, the upcoming film featuring Bellamkonda Sai Sreenivas, is an occult thriller thriller that promises…

35 minutes ago