
డ్రగ్స్ ముఠా మీద యుద్ధం చేస్తున్నామని… హైదరాబాద్ ను సేఫ్ అండ్ క్లీన్ సిటిగా మారుస్తామని… తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ ఎలా సరఫరా అవుతున్నాయో ఈ విచారణ ద్వారా తమకు తెలిసిందని అన్నారు. డ్రగ్స్ వాడుతున్న స్కూలు పిల్లల పేర్లను తాము బయట పెట్టలేదని చెప్పారు. తన సెలవులను సైతం రద్దు చేసుకుని అకున్ సబర్వాల్ ఈ విచారణను చేపట్టిన విషయం తెలిసిందే. సినీ ప్రముఖులను విచారణ చేస్తుండడంతో లోపల విషయాలను బయటకు రాకుండా అత్యంత రహస్యంగా వ్యవహరిస్తున్నారు.
ఇక మూడవ రోజు విచారణకు హాజరైన నటుడు సుబ్బరాజును దాదాపుగా ఆరు గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో సుబ్బరాజుకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయన్న విషయంపై అధికారులు ప్రశ్నించారు. పూరీ జగన్నాధ్ మాదిరిగానే ఉస్మానియా ఆసుపత్రి నుంచి వచ్చిన నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో సుబ్భారాజు నుండి కూడా బ్లడ్ శాంపిల్స్ ను తీసుకున్నారు. మూడు రోజుల విచారణలో భాగంగా తమకు కీలక సమాచారం లభించిందని సిట్ అధికారులు చెప్తున్నారు.
Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…