
అయితే తనకు లండన్ రావడం వీలు కాదంటూ ఇస్సాక్ నే భారత్‌కు ఆహ్వానించాడు. దీంతో జనవరి 19న తాను ఇండియాకు వస్తున్నట్టు పేర్కొన్న ఇస్సాక్ తన పాస్ పోర్ట్, టికెట్స్ కాపీని ఈ-మెయిల్ చేసింది. తన ప్లాన్‌లో భాగంగా మరుసటి రోజు నటుడికి ఫోన్ చేసిన ఇస్సాక్ తాను ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నానని, లగేజీ పరిమితికి మించడంతో కస్టమ్స్ అధికారులు 25,500 జరిమానా విధించారని, ఆ డబ్బును ట్రాన్సఫర్ చేయాల్సిందిగా కోరడంతో అతడు ఆ మొత్తాన్ని పంపించాడు.
ఆ తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేసి తనను కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకుని ఇస్సాక్ ను విడిచిపెట్టాలంటే మరో 50 వేలు చెల్లించాలని చెప్పడంతో ఢిల్లీకి చెందిన బ్యాంక్ అకౌంట్ కు 50 వేలు ట్రాన్సఫర్ చేశాడు. ఆ తర్వాత నటుడికి ఫోన్ చేసిన ఇస్సాక్ హైదరాబాద్ వచ్చేందుకు ఈ రోజు విమానాలు లేకపోవడంతో రేపు వస్తున్నట్టు చెప్పింది. అయితే తర్వాత రోజు లితిక అనే మహిళ నటుడికి ఫోన్ చేసి ఇస్సాక్ లండన్ కరెన్సీతో పట్టుబడిందని, నగదుతో సహా విడిచిపెట్టాలంటే 1.2 లక్షలు చెల్లించాలని చెప్పింది.
దీంతో అనుమానం వచ్చిన సదరు నటుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్లు నొబేర్త్ ఛుక్వేదో, నిమ్ మున్ కిమ్ లను అరెస్టు చేశారు. నిందితుల్ని అరెస్టు చేసి మంగళవారం హైదరాబాద్ తీసుకువచ్చారు. ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు, సంబంధాలు పెట్టుకోవద్దని ఈ సందర్భంగా పోలీసులు మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…