
సినీ ఇండస్ట్రీలో రాణించాలి అంటే బ్యాక్ గ్రౌండో, అవకాశాలో కాదు అదృష్టం కూడా కలిసి రావాలి అని నిరూపిస్తున్నారు కొంతమంది స్టార్స్ . బ్యాక్ గ్రౌండ్ ఉన్న యంగ్ హీరోలు. ఇందులో ముఖ్యంగా చెప్పుఉకోవాల్సి వస్తే అక్కినేని బ్రాండ్ ఇమేజ్ తో పాటుగా అతి చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోఇన్ని తప్పటడుగులు వేసి తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న మన సిసింద్రి అఖిల్.
మనం సినిమాలో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చి అక్కినేని అభిమానుల ఎదురు చూపులకు ఎండ్ కార్డు వేసిన అఖిల్…అఖిల్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే ఊహించని పరాజయం మూటకట్టుకున్న అఖిల్, హలో..మిస్టర్ మజ్ను.,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్నంత స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేకపోయారు.
ఏజెంట్ సినిమాతో అక్కినేని అభిమానుల సహనాన్ని కూడా పరీక్షించారు అఖిల్. అలాగే మరో స్టార్ ఫామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో అల్లు శిరీష్. ఇటు మెగా అటు అల్లు రెండు బ్రాండ్ లను పక్కన పెట్టుకుని కూడా సినీ ఇండస్ట్రీలో ఒక విజయాన్ని కూడా సాధించలేకపోయారు అల్లు శిరీష్. ఘట్టమనేని మహేష్ బాబు బావగా సుదీర్ ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సక్సెస్ మాత్రం అందని ద్రాక్షల సుధీర్ బాబుని ఊరిస్తూనే ఉంది.
మెగా హీరోలలో వరుణ తేజ్ కానీ సాయి ధర్మ తేజ్, వైష్ణవ తేజ్ ఇలా వీరి వెనుక మెగా అనే టాగ్ ఉన్నప్పటికీ అడపాదడపా ఒకటి రెండు హిట్లు ఇస్తున్నా రెండు హిట్లు నాలుగు ఫ్లాప్ లతో అలా కెరియర్ ని నెట్టుకెళ్తున్నారు. అలాగే చోటా కె నాయుడు బ్యాక్ గ్రౌండ్ తోవచ్చిన సందీప్ కిషన్ విజయం కోసం వెండి తెర మీద అలుపెరుగని యుద్దాలు చేస్తూనే ఉన్నారు. నిర్మాతగా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన బెల్లంకొండ సురేష్ ఫామిలీ నుండి వచ్చిన బెల్లం కొండా శ్రీనివాస్ ఎలా వచ్చాడో అలాగే కనుమరుగయ్యాడు.
అవకాశాలు సాధించాడనికి బ్యాక్ గ్రౌండ్ ఉపయోగపడుతుందేమో కానీ విజయాలు సాధించడానికి కాదని ఈ యువ హీరోలు నిరూపించారు. ఇండస్ట్రీలో కి రావడానికి ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఒక మెట్టుగా ఉందే కానీ ఏదగడానికి అది ఏమాత్రం సాయపడదు అనేది తేలిపోయింది. అవకాశంతో పాటు కొంత అదృష్టం, కథలను ఎంచుకునే విధానం, ప్రేక్షకులను మెప్పించే టాలెంట్ కూడా ఉన్నప్పుడే సక్సస్ వెతుకుంటూ వస్తుందని తేజ సజ్జా లాంటి యువ హీరోలు నిరూపించుకున్నారు.
An alleged mass shooting plot involving a Hindu temple in Aurora, Illinois, has been foiled,…
Gautam Gambhir turned 45 on Wednesday, October 14, but there was no birthday gift waiting…