
“దురంధర్ 2”తో పోటీగా దిగుతాం, మాకస్సలు భయమే లేదు అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన “టాక్సిక్” టీమ్ ట్రైలర్ రిలీజ్ కి ముందే తమ సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్న విషయం తెలిసిందే. మార్చ్ 19న విడుదలవ్వాల్సిన “టాక్సిక్” జూన్ 4కి పోస్ట్ పోన్ అయ్యింది. ఇక తర్వాత “దురంధర్” డామినేషన్ చూసి వాయిదా వేసుకోవడమే మంచిదైంది అనుకున్నారు జనాలు.
అయితే.. ఎంత సినిమాని వాయిదా వేసుకున్నా కనీస స్థాయి బజ్ లేకుండా సైలెంట్ అయిపోవడం లేనిపోని అనుమానాలకి తావిస్తోంది. సినిమాలో క్యాస్టింగ్ & కాన్సెప్ట్ & టీజర్లు మినీ సునామీ సృష్టించాయి. ముఖ్యంగా లేడీ డైరెక్టర్ జీతూ మోహన్ దాస్ హై ఆక్టేన్ రొమాన్స్ తో షాక్ ఇచ్చింది. కానీ.. సరిగ్గా 50 రోజుల్లో రిలీజ్ పెట్టుకుని “టాక్సిక్” ఇలా సైలెంట్ అయిపోవడం అనేది గమనార్హం.
యష్ నటించి, సహనిర్మాణ బాధ్యత వహించడమే కాక, రచయితగానూ తన అదృష్టాన్ని “టాక్సిక్”తో పరీక్షించుకోనున్నాడు. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి వంటి స్టార్ & హాట్ హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. విడుదలైన మొదటి సింగిల్ కి పెద్దగా బజ్ రాలేదు. దాంతో పాటల్ని విడుదల చేయాలన్న ఆలోచన విరమించుకున్నారు మేకర్స్. మరి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ట్రైలర్ వచ్చేలోపు వేరే ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసే స్కోప్ ఏమైనా ఉందా? అసలు జూన్ 4కి రిలీజ్ ఉందా? వంటి ప్రశ్నలకి సమాధానం టీమ్ అఫీషియల్ గా చెప్తే మంచిది.
KVN ప్రొడక్షన్ సంస్థ ప్రస్తుతం “జననాయగన్” సమస్యల్లో ఇరుక్కుని ఉన్నప్పటికీ.. ప్యాన్ ఇండియన్ సినిమాని ఇలా పక్కనపెట్టేయడం అనేది సమంజసం కాదు. ఈ సమస్యల కారణంగా ఈ నెలలో అఫీషియల్ గా మొదలవ్వాల్సిన చిరు-బాబీ సినిమా కూడా హోల్డ్ లో పడింది.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…