
యశ్ “టాక్సిక్” ఆగస్ట్ 26న విడుదల కానున్నట్లు ఇప్పుడే ప్రకటించారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా లాంగ్ వీకెండ్ హాలిడేస్ ను దృష్టిలో పెట్టుకుని బుధవారమే సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈమేరకు ఆగస్ట్ 2 సాయంత్రం నుండే ప్రీమియర్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ టాక్సిక్ రిలీజ్ ఎఫెక్ట్ అనేది టాలీవుడ్ రిలీజుల మీద ప్రభావం చూపడం ఖాయం.
ఆగస్ట్ లో ఆల్రెడీ స్వాతంత్ర దినోత్సవం వీకెండ్ ను నాగవంశీ “విశ్వనాథ్ & సన్స్”తో బ్లాక్ చేసి పెట్టుకున్నాడు. ఆగస్ట్ 21న రవితేజ “ఇరుముడి” రిలీజ్ అవుతుంది. “ప్యారడైజ్” ఆగస్టులో విడుదలవ్వడం కష్టమే. షూటింగ్ ఇంకా 50 రోజుల పెండింగ్ ఉందట. సో వస్తే సెప్టెంబర్ లేదంటే వచ్చే ఏడాదికి ప్లాన్ చేసుకోవడమే.
రవితేజ “ఇరుముడి”కి సరిగ్గా నాలుగు రోజుల తర్వాత విడుదలయ్యే “టాక్సిక్” థియేటర్లపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే.. నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది దిల్ రాజు. సో మ్యాగ్జిమం థియేటర్లు రాబట్టుకొనేందుకు విశ్వప్రయత్నం చేస్తాడు. మరి 25 సాయంత్రం వరకు మాత్రమే “ఇరుముడి”కి సరిపోదు కనీసం రెండు వారాలైనా మంచి థియేట్రికల్ రన్ ఉండాలి.
ఇక ఆగస్ట్ 28న రిలీజ్ కి ప్లాన్ చేసుకున్న శర్వానంద్ “భోగి” మరో తేదీని చూసుకోక తప్పదేమో. ఎందుకంటే థియేటర్లన్నీ టాక్సిక్ & ఇరుముడి ఉంటే.. వాటిలో శర్వానంద్ కి సర్దడం అనేది కష్టమైన పనే. మరి అందరూ కలిసి ఇంతలా సర్దుబాటు చేసుకున్నా “టాక్సిక్” ఈసారైనా ప్రకటించిన డేట్ కి విడుదలవుతుందా? లేక మునుపటిలా పోస్ట్ పోన్ అవుతుందా? అనేది చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…