
తన ఫిట్‌నెస్ రహస్యం నియమబద్ధంగా ఆహారం తీసుకోవడమేనని, తనకు ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టమని, ఇటీవల చూసిన చిత్రాలలో “సుల్తాన్” బాగా నచ్చిందని త్రిష చెప్పుకొచ్చింది. ‘మిమ్మల్ని ఏ ప్రశ్న అడిగితే ఇష్టం ఉండదు?’ అని తన అభిమాని వేసిన ప్రశ్నకు తనను ఎవరయినా పెళ్లెప్పుడు చేసుకుంటావ్? అని అడిగితే ఆ ప్రశ్న ఇష్టం ఉండదని చమత్కరించింది.
ఇక, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే… అన్న ప్రశ్నకు… పవన్ కల్యాణ్ ఆయన శైలిలో ఆయన జీవిస్తారని పేర్కొంది. స్టార్ డమ్‌కు పవన్ దూరంగా చాలా సింపుల్‌గా ఉంటారని చెప్పింది. అలాగే ప్రిన్స్ మహేష్ బాబు గురించి చెప్తూ… వృత్తిపై అంకితభావం కలిగిన స్వీట్ సూపర్ స్టార్ గా త్రిష అభివర్ణించింది. సినీ పరిశ్రమకు నిజమైన ‘డార్లింగ్’ ప్రభాస్ ని పేర్కొంది.
తాను బాధలో ఉన్నప్పుడు అందరికీ దూరంగా వెళ్లిపోతానని, తాను వివాదాస్పద అంశాలను చిరునవ్వుతో ఎదుర్కుంటానని చెప్పింది. తనకు బీఎండబ్ల్యూ కారంటే ఇష్టమని పేర్కొంది. తన అభిమాన నటి ప్రియాంక చోప్రా అని, నటుడు సల్మాన్‌ఖాన్ అని చెప్పింది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…