
‘అ…ఆ…’ ఆడియో వేడుకపై పవన్ ప్రసగించే ముందు మైక్ తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో పవర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్నంత సేపు చేతులు కట్టుకుని, తల వంచుకుని వినమ్రంగా నిల్చోవడం పవన్ కళ్యాణ్ వంతయ్యింది. ఇంతకీ పవన్ మాట్లాడే ముందు త్రివిక్రమ్ ఇచ్చిన ఇంట్రడక్షన్ ఏమిటో తెలుసా…
“కొండ ఒకరికి తలొంచి ఎరుగదు, శిఖరం ఒకరికి సలాం అని తలొంచి ఎరగదు, కెరటం అలసిపోయి ఒకరి కోసం ఆగదు, తుఫాన్ ఒకరి ముందు తలోంచదు. నాకు ఇష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం, నేను శత్రువు మీద చేసే యుద్ధం, నేను ఎక్కుపెట్టిన బాణం, నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం, నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు, ఎంత మంది గుండెలు తడపడానికో వచ్చే ఓ చిన్న వర్షపు చినుకు, ఓ స్నేహపు రుతుపవనం… పవన్ కళ్యాణ్… వింటారా… వెంటే వస్తారా… తోడుగా ఉందాం వస్తారా… రండి విందాం..!” అంటూ త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యల తర్వాత పవన్ మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ గురించి ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ తప్ప ఈ రేంజ్ లో మరొకరు ఇంట్రడక్షన్ ఇవ్వలేరని చెప్పడంలో సందేహం లేదు. అందుకనే ఈ మాటలను, పదే పదే చదువుకుని మురిసిపోతూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు హంగామా చేస్తున్నారు. ఆ మాత్రం ప్రభావితం చేయకపోతే త్రివిక్రమ్ మాటలు ఎందుకు అవుతాయి మరి..!
The decision to bring Hari Gowra on board for the background score of Chiranjeevi's Vishwambhara…
The makers of Spirit have responded to rumours about a possible delay or shutdown. Reports…