
అయితే ఈ వాయిస్ ఓవర్ కు మరింత ప్రాధాన్యత దక్కే విషయమేమిటంటే… నాగార్జున చెప్పే డైలాగ్స్ ను ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందివ్వడం. తాజా సమాచారంతో ‘ప్రేమమ్’పై అక్కినేని అభిమానుల్లో ఉన్న క్రేజ్ మరింత రెట్టింపయ్యింది. నాగార్జున – త్రివిక్రమ్ కాంభినేషన్ లో వచ్చిన ‘మన్మధుడు’ సినిమాలో డైలాగ్స్ ఏ రేంజ్ లో పేలాయో తెలిసిందే. దీంతో మరోసారి త్రివిక్రమ్ డైలాగ్స్ నాగ్ నోటి వెంట రానున్నాయన్న సమాచారం అక్కినేని ఫ్యాన్స్ కు మాంచి బూస్టింగ్ ఇస్తోంది.
గతంలో ‘జల్సా’ సినిమాకు గానూ మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ డైలాగ్స్ కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. దీంతో, కింగ్ నరేట్ చేసే స్టోరీ డైలాగ్స్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరో వైపు త్రివిక్రమ్ అభిమానులకు కూడా ఇదొక సర్ ప్రైజింగ్ న్యూసే మరి!
There is no director in Indian cinema, who is as capable as Rajamouli when it…
డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారు? తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే పది రోజుల్లోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిపివేయించేస్తానని చెప్పారు. పది…