
బుల్లితెర ‘మాటల మాంత్రికుడు’గా పేరు గాంచిన హైపర్ ఆది ‘జబర్దస్త్’లో ఒక టీం లీడర్. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిన ఆది వేసే పంచ్ లకు నవ్వని వారుండరనడంలో అతిశయోక్తి లేదు. ఆది పంచ్ లను చూసి హీరో నాని అయితే ఆది డైలాగ్స్ చెప్పే టైమింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఒకప్పుడు ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’లో ఉండే ఆది, ప్రస్తుతం ‘జబర్దస్త్’లో దర్శనమిస్తున్నారు. దీనికి ఉన్న బలమైన కారణం తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే.
ఆది ఉన్న ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’కు రేటింగ్స్ బాగానే వస్తున్నా, ‘జబర్దస్త్’లో ప్రేక్షకులను హాయిగా నవ్వించే టీం కొరవడడంతో ఆదిని ‘జబర్దస్త్’కు బదలాయించి రేటింగ్స్ ను పెంచుకునే కార్యక్రమాన్ని చేపట్టింది. అది ‘హైపర్’ ఆది పంచ్ పవర్. ఒక రకంగా త్రివిక్రమ్ క్లాస్ పంచ్ లను, పూరీ మాస్ పంచ్ లను మిక్స్ చేస్తే ఎలా ఉంటాయి అంటే… అది ‘హైపర్’ అది పంచ్ లా మాదిరి ఉంటాయని చెప్పవచ్చు. అలాంటి ఆది ‘పంచ్’లకు గురువైన త్రివిక్రమ్ పక్కన దర్శనమివ్వడంతో, ఈ ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…