
సరే అయిందేదో అయ్యింది మహేష్ బాబుతో జట్టు కట్టాక ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. అతడుని మించే మేజిక్ ని, ఖలేజా గాయాన్ని మాన్పే అద్భుతాన్ని ఆశించడం మొదలుపెట్టారు. తీరా చూస్తే ఇదీ నత్తనడకనే సాగుతోంది. ఫైట్ మాస్టర్లు అన్బు అరవులతో కంపోజ్ చేయించిన యాక్షన్ ఎపిసోడ్ ఏమంత సంతృప్తికరంగా రాలేదని, అందుకే మహేష్ బ్రేక్ ఇచ్చాడనే ప్రచారం జరిగింది. ఆ మధ్య వినోదయ సితం రీమేక్ స్క్రిప్ట్ పనులు కూడా త్రివిక్రమే చేశాడనే టాక్ చక్కర్లు కొట్టింది. ఇంతాచేసి అది మొదలుకాలేదు.
ఈలోగా ఇందిరాదేవి గారి హఠాన్మరణం మొత్తం సీన్ మార్చేసింది. ఆవిడ కాలం చేయడం కృష్ణ గారి కుటుంబానికి తీవ్ర విషాదం కాబట్టి దాన్ని కారణంగా చూపడానికి అవకాశం లేదు. దానికన్నా ముందే చాలా ఆలస్యం జరిగింది. మరో నాలుగు రోజుల్లో త్రివిక్రమ్ పుట్టినరోజు వస్తోంది. ఆ సందర్భంగా ఏదైనా కీలక అప్ డేట్ ఉంటుందేమోనని మహేష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ దానికి బదులు సోషల్ మీడియాలో ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం రిలీజైన నువ్వే నువ్వే రీ రిలీజ్ తాలూకు హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది.
డైరెక్టర్ గా ఆయన డెబ్యూ మూవీని డిమాండ్ మేరకు థియేటర్లలో విడుదల చేస్తున్నామని యాడ్స్ తో హోరెత్తిస్తున్నారు. అల వైకుంఠపురములో వచ్చి మూడేళ్లవుతున్నా ఇంకా త్రివిక్రమ్ కొత్త సినిమా రెగ్యులర్ షూట్ ప్రాపర్ గా జరగకపోవడం కరెక్ట్ కాదు. పోనీ రాజమౌళి లాగా ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి గ్రాండియర్లు తీస్తున్నారా అంటే అదీ లేదు. కమర్షియల్ ఎంటర్ టైనర్లకే కామెడీ పంచుల కోటింగ్ ఇచ్చి స్టార్ హీరోల ఇమేజ్ తో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. మరి ఇంతలాస్యం ఎందుకు త్రివిక్రమా అంటే సమాధానం ఏదీ?
Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…
Dharshna Sripal turns up the charm in this glossy, mood fresh gallery that blends soft…