
అయితే ఇవన్నీ జరగాలంటే టీడీపీ శాసనసభ పక్షాన్ని తెరాస శాసనసభ పక్షంలో విలీనం చేస్తున్నట్టు స్పీకర్ కు లేఖ ఇవ్వాలని తెరాస వారు కండిషన్ పెట్టారట. అవసరం కోసం తెరాసలోకి మారని తప్పని పరిస్థితి అయితే రాజకీయంగా అనేక అవకాశాలు ఇచ్చి, ఈ స్థాయికి తెచ్చిన పార్టీకి ఆ ద్రోహం మాత్రం చెయ్యలేను అంటున్నారంట సండ్ర, అయితే తెరాసలో చేరిక ఆలస్యం అయితే ఓటుకు నోటు కేసు గొడవ మళ్లీ వస్తుందేమోనన్న భయం కూడా ఉందని అంటున్నారు.
దీంతో ముందు కొంత బెట్టు చేసినా టిడిపిని తెరాస లో విలీనం చేయడానికి వీలుగా సండ్ర లేఖ ఇవ్వకతప్పదని సమాచారం. గత శాసనసభలో కూడా ఇలాగే ఆపరేషన్ ఆకర్షతో టీడీపీ శాసనసభ పక్షాన్ని తెరాస శాసనసభ పక్షంలో విలీనం చేసుకుంది అధికార పక్షం. ఈ సారి టీడీపీకి ఇద్దరే శాసనసభ్యులు ఉండటంతో ఆ పని మరి కాస్త తేలిక అయ్యింది. అయితే టీడీపీతో పాటు ఈ సారి కాంగ్రెస్ ను కూడా విలీనం చేసుకోవాలని అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తుంది
ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు…
The TDP-led alliance has finally begun addressing the growing concerns over seat-sharing and coordination ahead…