
మీటింగ్ అయ్యాక మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్వయంగా కేసీఆర్ ను పొగిడారు. అయితే ఆ స్థాయి మర్యాద తెరాస ఆయనకు ఇవ్వలేదు అని మీడియా అనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గురించి, ఆయన స్వయంగా వచ్చి అభినందించిన తీరును కేసీఆర్ గాని మంత్రులు గాని మీడియా ముఖంగా ప్రశంసించింది లేదు.
పైగా ఆ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని టిఆర్ఎస్ తెలిపింది. తెలంగాణ శాసనమండలిలో విప్ పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అప్పాయింట్ మెంట్ కోరారని అన్నారు. తెలంగాణలో రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరాను మెచ్చుకున్నారని ఆయన అన్నారు.
మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చంద్రబాబు నాయుడు దగ్గర నుండి మంత్రులదాకా అంతా పవన్ కళ్యాణ్ కు సముచిత గౌరవం ఇస్తూనే ఉన్నారు. ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ను విమర్శించినా పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడింది లేదు. తెలంగాణ ప్రభుత్వం తీరుతో జనసేన అభిమానులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…