దీపావళికే లక్ష్మీ బాంబులు… ఏడాది పొడవునా ట్రంప్‌ బాంబులు

దీపావళి పండుగకి లక్ష్మీ బాంబులు పేలితే, గత రెండున్నరేళ్ళుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ యావత్ ప్రపంచదేశాల మీద ‘ట్రంప్‌ బాంబులు’ ప్రయోగిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తూనే ఉన్నారు.

ADVERTISEMENT

ఇటీవల అమెరికన్లను ‘ట్రంప్‌ డివిడెండ్’ ప్రకటించిన ఆయన, భారత్‌తో సహా విదేశీ ఉద్యోగులపై మరోసారి ‘హెచ్-1 బీ’ బాంబు ప్రయోగించారు.

ఇప్పటికే దీనిని చాలాసార్లు.. చాలా రకాలుగా ప్రయోగించారు కదా?అనే సందేహం కలుగుతుంది. కానీ నాడు రామాయణ, మహాభారతాలలో శత్రువులపై సందించిన బాణాలు, వారిని సంహరించిన తర్వాత మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చి అమ్ముల పొదిలో చేరినట్లుగానే, ట్రంప్‌ ప్రయోగించే ఈ హెచ్-1 బీ వీసా బాంబు కూడా ఎన్నిసార్లు ప్రయోగించినా మళ్ళీ మళ్ళీ ప్రయోగించవచ్చు. అవి మళ్ళీ మళ్ళీ పేలుతూనే ఉంటాయి.

తాజాగా హెచ్-1 బీని మరోసారి ప్రయోగిస్తూ, దీనిలో 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించేందుకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ కొత్త ప్రతిపాదన చేసింది.

ఈ వీసాపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారు, ఏ కారణం చేతయినా ఆ ఉద్యోగం పోతే మరో ఉద్యోగం వెతుక్కోవడానికి 60 రోజులు గడువు లభిస్తుంది. ఆ గడువుని ఎత్తివేయాలనేదే తాజా ప్రతిపాదన!

కనుక ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, అమెరికాలో ఉద్యోగం పోతే వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన అమలైతే దీని ప్రభాం హెచ్-1 బీ వీసాలను అత్యధికంగా వినియోగించుకుంటున్న భారతీయులపైనే పడుతుంది.

కనుక మళ్ళీ స్వదేశానికి తిరిగివచ్చి అమెరికాలో వేరే కంపెనీలో ఉద్యోగం సంపాదించుకొని, మళ్ళీ కొత్తగా హెచ్-1 బీ సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంత కష్టమో హెచ్-1 బీ బాధితులకే తెలుసు.

అయితే ఇక్కడితో ఇది ముగిసిపోదు. ఈ నిబంధన అమలులోకి వస్తే, హెచ్-1 బీ వీసాలపై వచ్చినవారి కుటుంబ సభ్యులపై కూడా పడుతుంది.

ఈ-1, ఈ-2, ఈ-3, హెచ్-1బీ1, టిఎన్, ఎల్-1, ఓ-1 వీసాలపై అమెరికాలో ఉంటున్నవారిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. వారు కూడా మూటాముల్లె సర్దుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే నిబంధనల ప్రకారం ముందుగా ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియకు రెండు నెలల గడువు ఉంటుంది. అత్యధిక శాతం అనుకూలంగా ఉంటే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు.

కానీ రాజుగారు తలచుకుంటే కొరడా దెబ్బలకు కరువా అన్నట్లు, ట్రంప్‌ దొరవారి అభిమతం ప్రకారమే ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరుగవచ్చు. కనుక ట్రంప్‌-బాధితులు మళ్ళీ అమెరికా సుప్రీంకోర్టు తలుపు తట్టక తప్పదేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

From Rowdy Wear to UNHYPE: Vijay’s Business Game Grows

Vijay Deverakonda is making another move outside cinema, and this time he is putting his…

20 minutes ago

మహేష్ బాబు, రాజమౌళికి కూడా నోటీసులు వచ్చాయి కానీ..

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్’) ప్రక్రియలో భాగంగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు నోటీసు ఇచ్చినప్పుడు అందుకు…

45 minutes ago