Telugu

ట్రంప్‌ ఇప్పుడు యుద్ధం ఆపలేరు… కొనసాగించలేరు!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తమకి ఇరాన్‌ మీద యుద్ధం ‘చిన్న పిక్నిక్ వంటిదని’ మొదట్లో చెప్పుకున్నారు. కానీ దాదాపు నాలుగు వారాలుగా సాగుతున్న ఈ యుద్ధానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారు.

ఆయన పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఇరాన్‌ విషయంలో ఇలా ఎదురు దెబ్బలు తింటున్నందుకు నవ్వులపాలవుతూనే ఉన్నారు. చమురు కోసం ప్రపంచదేశాల ఒత్తిళ్ళు భరించడం చాలా కష్టంగానే ఉంటుంది.

ADVERTISEMENT

అందుకే యుద్ధం మద్యలో ప్రపంచ దేశాల చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్‌ నుంచి స్వాధీనం చేసుకొనేందుకు, తెరిపించేందుకు పూనుకోవలసి వచ్చింది. కానీ దాని కోసం ట్రంప్‌ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.

చివరికి ఇరాన్‌ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై దాడులు చేసి నేలమట్టం చేస్తామని ట్రంప్‌ బెదిరించినా ఇరాన్‌ లొంగకపోగా ఈసారి ప్రతిదాడులు మరింత భీకరంగా ఉంటాయని హెచ్చరించింది. దీంతో ట్రంప్‌ వెనక్కు తగ్గి 5 రోజులు గడువు పెట్టుకోవాల్సి వచ్చింది!

ఇరాన్‌కు 48 గంటలు గడువు విధించిన ట్రంప్‌ స్వయంగా ఆ గడువుని 5 రోజులు పొడిగించుకోవాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుడుకి ఇంతకంటే దయనీయం ఏముంటుంది?

ఈ పరిస్థితికి కారణం ట్రంప్‌ ఇరాన్‌ని చాలా తక్కువగా అంచనా వేసి ‘పిక్నిక్‌ యుద్ధం’ ప్రారంభించడమే. ఉక్రెయిన్‌పై రష్యా కూడా ఇలాగే ‘పిక్నిక్ యుద్ధం’ మొదలుపెడితే నాలుగేళ్ళుగా దానిని ముగించలేకపోతోంది. ఈ దెబ్బకు ఉక్రెయిన్‌తో పాటు రష్యా కూడా చాలా తీవ్రంగా నష్టపోతోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించిన ట్రంప్‌ కూడా ఇరాన్‌ విషయంలో పుతిన్ చేసిన తప్పే చేశారని స్పష్టమవుతోంది.

యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్‌ ఇప్పుడు ఆపేద్దామంటుంటే, ఇరాన్‌ మాత్రం ‘ఆపేదేలే’ అంటూ సోమవారం కూడా గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగించింది.

ఇరాన్‌ ప్రతినిధులతో శాంతి చర్చలు మొదలయ్యాయి..ఫలవంతంగా సాగుతున్నాయి. నాలుగైదు రోజులలోనే కొలిక్కి రావచ్చని ట్రంప్‌ చెప్పుకుంటుంటే, అలాంటిదేమీ లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది.

నష్టాలలో కూరుకుపోతున్న ప్రపంచ చమురు మార్కెట్‌ని బ్యాలన్స్ చేసి సాధారణ స్థాయికి తెచ్చేందుకే అమెరికా ఇలాంటి అబద్దాలు ఆడుతోందని ఇరాన్‌ స్పష్టం చేసింది.

ఇప్పుడు ట్రంప్‌ వీలైనంత త్వరగా ఈ యుద్దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆరాటపడుతున్నారు. కానీ అపలేకపోతున్నారు. అలాగని కొనసాగించలేకపోతున్నారు.

అమెరికా అధ్యక్షుడు అంతటివాడు ఇలాంటి దయనీయ దుస్థితిలో ఉండటం చూస్తున్నవారు నవ్వుకోకుండా ఉంటారా? ప్రపంచదేశాలకు నరకం చూపించినందుకు ట్రంప్‌కు ఇది తగిన శాస్తే కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

No Restriction On KTR’s Passport, Foreign Travel?

Earlier there were multiple unverified media reports about the ACB court potentially looking at impounding…

8 minutes ago

Mammootty vs Dulquer: Rare Father-Son BO Clash!

November 20 could witness an interesting box-office battle, with Mammootty and Dulquer Salmaan finding themselves…

38 minutes ago