
డాక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి నారాయణ పంతులు అనే ధర్మాత్ముడు ఆంద్రాకి కూడా ఓ గొప్ప కళాక్షేత్రం ఉండాలనే ఉద్దేశ్యంతో విజయవాడ నగరపాలక సంస్థకి స్థలాన్ని దానంగా ఇచ్చారు. ఆ స్థలంలో ఆడిటోరియం నిర్మించి దానికి ప్రముఖ వాగ్గేయకారుడు, మహాకవి క్షేత్రయ్య కళాక్షేత్రం అని పేరు పెట్టారు. దానికి స్థలం ఇచ్చిన దాత గౌరవార్ధం తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం అని పేరు పెట్టారు.
ఆ తర్వాత అక్కడ అనేక వేల సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అనేకమంది ప్రముఖులకి సన్మానాలు, సత్కారాలు జరిగాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించడం అంటే కళాకారులు ఎంతో గౌరవంగా, ఎంతో గర్వంగా భావిస్తుంటారు.
వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రెండు కోట్లు నిధులు విడుదల చేయడంతో దానిని అద్భుతంగా తీర్చిదిద్దారు. గత ప్రభుత్వం మళ్ళీ రూ.8 కోట్లు వెచ్చించి అత్యాధునిక లైటింగ్, సౌండ్ సిస్టమ్, సీటింగ్, లాండ్ స్కేపింగ్ వగైరాలతో మరింత తీర్చిదిద్దింది. వైసీపీ ప్రభుత్వం కూడా కోటి రూపాయలతో దానిని మరింత ఆధునీకరించింది.
కానీ ఆ పేరులో ఏం తప్పు కనుగొందో ఏమో ‘తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య’ పేరుని తొలగించేసి ఒట్టి కళాక్షేత్రంగా మిగిల్చింది. అసలు ఈ పేర్లు, ఊర్లు, రంగులు మార్చడం, కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కట్టడాలని కూల్చివేయడం, మళ్ళీ కోట్లు ఖర్చు చేసి కొత్తవి కట్టడం దేనికో తెలీదు. కానీ రాజకీయ కారణాలతో మహనీయుల గౌరవార్దం పెట్టిన పేర్లని తొలగించడం వారిపట్ల అవమానకరంగా వ్యవహరించడమే కాకుండా వాటితో ముడిపడి ఉన్న ప్రజల మనోభావాలని కూడా కించపరిచిన్నట్లు భావించవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించి వాటికి తనకి నచ్చిన పేర్లు పెట్టుకొంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు కానీ ఎప్పుడో నిర్మించబడిన వాటి పేర్లు మార్చాలనుకోవడమే సరికాదు.
Festival releases are usually a dream for film producers for better openings and a chance…
Yashasvi Jaiswal has started working on wicketkeeping ahead of the 2026-27 Ranji Trophy season, but…