Telugu

‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో దొరికిన తెలుగు సినీ నటుడు!

హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్ మూడు రోజుల్లో తప్పనిసరిగా పోలీసుల తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా నిర్వహించిన ‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో తెలుగు నటుడు భరణిశంకర్ దొరికిపోయారు. భరణిశంకర్ నడుపుతున్న కారును ఆపి, బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు నిర్వహించిన తర్వాత 41 శాతానికి పైగా రావడంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసారు.

సోమవారం నాడు భరణిశంకర్ ను కోర్టులో హాజరు పరచనున్నామని పోలీసులు తెలిపారు. 30 శాతంపైగా నమోదైతే పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకుంటారన్న విషయం బహిరంగమే. సీరియల్స్ ఆర్టిస్టుగా భరణిశంకర్ వీక్షకులకు సుపరిచితమే. అలాగే పలు సినిమాలలో కూడా నటించిన భరణి, ‘బాహుబలి’లో కూడా భాగస్వామి అయిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సెలబ్రేటీలు పట్టుబడుతున్న వైనం వారి వ్యవహార తీరును బయటపెడుతోంది.

ADVERTISEMENT

సెలబ్రిటీలు ఎక్కువగా తిరిగే జూబ్లీహిల్స్ ప్రాంతంలో పోలీసుకు తనిఖీలు నిర్వహిస్తుండగా, వరుసపెట్టి ఎవరో ఒకరు పట్టుబడుతూ ఉండడం విశేషం. అంటే ఫైన్లు కట్టడానికైనా సిద్ధం కానీ, నిబంధనలను మాత్రం పాటించమని పరోక్షంగా సినీ సెలబ్రిటీలు చెప్తున్నారా? అన్న ప్రశ్నలను లేవనేత్తుతోంది.

Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

అమరావతిపై విషం కక్కుతున్నందుకే ఓటమి.. అయినా మారేదేలే!

ఆంధ్రాలో నేడు విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓ పక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ జరుగుతోంది. ఎప్పటిలాగే కడప జిల్లాలో ప్రధానంగా..…

24 minutes ago

Tollywood Has Heroes, But Where Are the Storytellers?

Whenever films like Baththa and Dorothy come up, some are quick to ask why Telugu…

35 minutes ago