
‘జబర్దస్త్’ బ్యూటీలైన అనసూయ, రష్మీలే ఇందుకు నిదర్శనం. వీరు ఏ షాప్ ఓపెనింగ్ కు వచ్చినా… అక్కడంతా అభిమాన సందోహమే. ఇటీవల కాలంలో అనసూయ, రష్మీలు చేసిన షాప్ ఓపెనింగ్స్ ప్రభావం తెలిసిందే. ఇదే బాటలో ‘పటాస్’ బ్యూటీ శ్రీముఖి కూడా పయనిస్తోంది. అయితే ముందుగా సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమన్న శ్రీముఖి, ప్రస్తుతం బుల్లితెరపై అనసూయ, రష్మీలతో పాటు రాణిస్తోంది.
‘జులాయి’ వంటి పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ వేసిన శ్రీముఖి, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ వంటి సినిమాలలో లీడ్ రోల్స్ లోనూ చేసింది. అయితే అప్పుడు అదృష్టం కలిసి రాక, బుల్లితెరపై ప్రత్యక్షమై క్రేజ్ ను తెచ్చుకుని, మళ్ళీ వెండితెరపై దండయాత్ర చేయబోతోంది. ప్రస్తుతం అనసూయ, రష్మిలు కూడా సినిమాలలో రాణిస్తున్న వైనం మాదిరే, రెండు పడవలపై శ్రీముఖి అడుగులు పడుతున్నాయి.
ఇప్పటికే హర్షవర్ధన్ దర్శకత్వంలో “గుడ్ బ్యాడ్ అగ్లీ” సినిమాను సిద్ధం చేసిన శ్రీముఖి, తాజాగా మరో సినిమాను అంగీకరించింది. వాసు దర్శకత్వంలో “కుటుంబ కధాచిత్రం” అనే సినిమాలో నందు సరసన శ్రీముఖి కనిపించబోతోంది. ఈ రెండు సినిమాలతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ అందాల బొమ్మ సిద్ధమవుతోంది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…