
మంగళవారంతో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా షూటింగ్ కు చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వ్యాప్తంగా సందడి చేసిన ఈ విషయంపై సదరు న్యూస్ ఛానల్ మాత్రం… ఇంకా ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉందని, ఈ సంక్రాంతి బరిలో నుండి తప్పుకోవచ్చని, “డిక్టేటర్”తో పోటీ పడటం ఇష్టం లేక కూడా ఒక వారం పాటు సినిమాను వాయిదా వేయవచ్చని కధనాలు ప్రసారం చేసింది. ఇక్కడితో ఆగితే వింతేముంది..!
జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ గా ఓ సూట్ కేసు పట్టుకుని నడిచి వస్తున్న పోస్టర్ పై సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశంసలు లభించగా, ఇదే పోస్టర్ పై సోషల్ మీడియాలో సైటర్లు పడుతున్నాయంటూ… ‘అసలే ఎన్టీఆర్ హైట్ తక్కువ, దానికి తోడు అంత పెద్ద సూట్ కేసు పట్టుకుని వస్తుంటే బస్సులో తిరుగుతున్న ప్రయాణికుడు మాదిరి కనపడుతున్నాడనే…’ కామెంట్లు వస్తున్నాయని అభిప్రాయపడింది.
మరి ఏ ఉద్దేశంలో ఇలా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయో గానీ, సదరు ఛానల్ కధనాలపై ‘బుడ్డోడు’ అభిమానులు మండిపడుతున్నారు. షూటింగ్ పూర్తయ్యాక కూడా, ఇంకో పాట మిగిలి ఉందని ఎలా చెప్తారని, కనీస మీడియా నైతికత పాటించాలని ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఛానల్ పేరు కావాలా? ఓ చిన్న హింట్… వార్తల కంటే యాడ్ లు ఎక్కువగా ప్రసారమయ్యే ఛానల్!
కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…
Telangana Assembly sessions are rarely short of political drama, but today’s developments have taken the…