
[m9ad]
దీనిపై బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్ తీవ్రంగా స్పందించారు. ‘ఎమ్మెల్యే అలా వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గుచేటు. ఆయన మాటలు రోత పుట్టించేలా ఉన్నాయి. ఇలాంటి చెత్తే ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూ దేశాన్ని మతం పేరిట విడగొడుతోంది. నిజంగా అతని వ్యాఖ్యలు అసహ్యం కలిగిస్తున్నాయి’ అని ట్వీట్ చేసింది. అలాగే ఇటీవల వరవరరావు, సుధా భరద్వాజ్ సహా పలువురు హక్కుల కార్యకర్తలను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అరెస్టులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ‘మీ టూ అర్బన్ నక్సల్’ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడిచింది. దీనికి స్వరభాస్కర్ సైతం మద్దతు తెలిపింది.
ఈ నేపథ్యంలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్వరభాస్కర్ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ… “మీ టూ ప్రాస్టిట్యూట్ నన్ అని ప్లకార్డులు పట్టుకుని ఇంకా ఎవరూ రాలేదే?” అంటూ అసభ్యకరమైన కామెంట్ చేశారు. దీంతో వివేక్ వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందిస్తూ… అత్యాచార బాధితుల బాధను తనకు నచ్చని వాళ్లపై దాడిచేసే ఆయుధంగా వివేక్ వాడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కామెంట్లపై స్వరభాస్కర్ ట్విట్టర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా, దీన్ని పరిశీలించిన ట్విట్టర్ యాజమాన్యం వెంటనే దాన్ని తొలగించాలని వివేక్ అగ్నిహోత్రికి సందేశం పంపింది. వెంటనే తేరుకున్న వివేక్ అసభ్య కామెంట్ ను డిలీట్ చేయగా, ట్విట్టర్ యాజమాన్యానికి స్వరభాస్కర్ కృతజ్ఞతలు తెలిపింది.
The Telangana government has carried out a major reshuffle of senior IAS officers. The changes…
ఉండవల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో కూటమి అధినేతల సంయుక్త సమావేశంలో జనసేన అధినేత, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెప్పిన…