Telugu

మధుప్రియ “రాజీ” వెనుక ఉన్న అసలు “ట్విస్ట్”

24 గంటలు గడవక ముందే సింగర్ మధుప్రియ తన భర్త విషయంలో వైఖరి మార్చుకుంది. కేసు పెట్టిన రాత్రి మీడియాతో మాట్లాడుతూ ‘బండ బూతులు తిడుతూ, ఇక తన జీవితంలో శ్రీకాంత్ అనే వాడు లేదు, ఇది ఫిక్స్’ అంటూ భీకరమైన ప్రకటనలు చేసిన మధుప్రియ, మరో 24 గంటలు ముగిసే సమయానికి ‘హి ఈజ్ గుడ్’ అంటూ తన స్టేట్మెంట్ ను మార్చుకుంది. అయితే ఇంతలోనే అంత మార్పుకు గల కారణమేంటి? అన్న రీతిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

దీనికి ప్రధాన కారణం… మధుప్రియ తల్లితండ్రులేనని తాజాగా మీడియా వర్గాల్లో వ్యక్తమవుతున్న విశ్లేషణ. మధుప్రియ భర్త శ్రీకాంత్ అనుకుని మహ్మద్ నయీమ్ అనే వ్యక్తిని మదుప్రియ తల్లితండ్రులు, మరికొందరు బంధువులు చితకబాదారు. దీంతో మొత్తం 14 మందిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. దీంతో ఈ కేసు తమ మెడకు చుట్టుకుంటుందన్న ఉద్దేశంతోనే మధుప్రియ తల్లితండ్రులు రాజీకి వచ్చినట్లుగా లేటెస్ట్ న్యూస్.

అందులో భాగంగానే భర్త శ్రీకాంత్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని మధుప్రియ పోలీసులకు చెప్పిందని, ఇరు పక్షాలు కేసులు ఉపసంహరించుకునే విధంగా ఒప్పందాలు జరిగాయని, ఈ క్రమంలోనే ‘బూతులు’ తిట్టిన నోటితోనే ‘మానవత్వం’ అంటూ మధుప్రియ శ్రీకాంత్ పై అపారమైన ప్రేమ చూపించిందని, తల్లితండ్రుల కోసం రాజీకి వచ్చిందని ప్రసారమవుతున్న కధనాలలో వాస్తవమెంత ఉందో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

1 hour ago

Sardar 2: Can Karthi Survive the Deadly Mandaadi Clash?

Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…

2 hours ago