
తెలుగు అసోసియేషన్ పత్రాలపై అమెరికాకు వెళ్లగా, కొన్ని వీసాలు హైదరాబాద్ కాన్సులేట్ నుంచే లభించాయి. కిషన్ చేతిలో చిక్కుకున్న ఓ నటి వాంగ్మూలం ఇస్తూ… తాను గత డిసెంబర్ 26న అమెరికాకు వెళ్లానని, పెన్సిల్వేనియాలో జరిగే నృత్య ప్రదర్శనకు పిలిచిన కిషన్, బలవంతంగా వ్యభిచారం చేయించడానికి ప్రయత్నించారని ఆరోపించింది. తాను వ్యభిచారం చేయలేదని, కస్టమర్లున్న గదిలో అరగంట సేపు బలవంతంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది. మరో నటి మాట్లాడుతూ… చికాగోకు తనను పిలిపించిన కిషన్, మూడు నగరాలకు తిప్పారని, హోటల్ లో ఉంచి కస్టమర్లను పంపించే వాడని చెప్పింది. ఈ విషయాలు ఎక్కడైనా చెబితే తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడని వాపోయింది.
అలాగే మరో నటి స్పందిస్తూ… కిషన్ భార్య చంద్రకళ తనను హోటల్ కు తీసుకెళ్లి కస్టమర్లకు పరిచయం చేసి, పది నిమిషాల తరువాత వెళ్లిపోయేదని, ఆ తరువాత తనను తిరిగి వెనక్కు రప్పించేదని, రెండు ప్లాట్లతో ఉన్న కిషన్ ఇంట్లో ఒకదానిలో కిషన్, చంద్రకళ ఉండేవారని, రెండోదానిలో తనను ఉంచి విటులను పంపేవారని, తిరిగి వచ్చేందుకు వేరే మార్గం లేక వ్యభిచారం చేయాల్సి వచ్చిందని వాపోయింది. ఈ హీరోయిన్లంతా అప్రూవర్లుగా మారినట్లయితే యుఎస్ సెక్స్ రాకెట్ కేసు కీలక మలుపు తీసుకున్నట్లే! ఈ కేసులో నిజానిజాలు బయటకు రావాలన్న డిమాండ్ సర్వత్రా వినపడుతోంది.
Why are heroines still hesitant to play mothers or married women on screen? The concern…
Janhvi Kapoor has finally addressed the backlash over her portrayal in Ram Charan’s Peddi, admitting…