
వీరిద్దరితో పాటు కాంగ్రెస్ పార్టీలో గెలిచి, టీఆర్ఎస్‌లో చేరిన సబితా ఇంద్రారెడ్డికి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్‌లకు అవకాశం కలిపించారు. ఇప్పటిదాకా తెలంగాణకు మహిళా మంత్రులు లేరు. దానితో అనేక విమర్శలు రావడంతో కేసీఆర్ ఒకేసారి ఇద్దరు మహిళలకు అవకాశం కలిపించారు. పువ్వాడ అజయ్ కు అవకాశం కలిపించడంతో ఖమ్మంకు మొట్టమొదటి సారి కేసీఆర్ రెండో విడత ప్రమాణం చేసాకా ప్రాతినిధ్యం కలిపించినట్టు అయ్యింది.
ఇప్పటికి మంత్రివర్గంలో 12 మంది ఉండగా, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఆరుగురితో కలిపి తెలంగాణలో మంత్రుల సంఖ్య 18కి చేరనుంది. మరోవైపు తెరాసలో ఇటీవలికాలంలో పెరిగిన కొంత అసంతృఫ్తిని తగ్గించే దిశలో కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నట్లుగా ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ్హరికి ,సీనియర్ నేతలు మదుసూదనాచారికి, నాయిని నరసింహారెడ్డి వంటి వారికి కూడా పదవులు రాబోతున్నాయి. ఇప్పటికే చీప్ విప్,విప్ పదవులను ముఖ్యమంత్రి కెసిఆర్ భర్తీ చేశారు.తాజాగా ఆయన కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా కేటాయించబోతున్నారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించే ఆలోచనలో ఉన్నారట.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
Telangana politics are starting to heat up again as a social issue has come up…