
సందీప్ కిషన్ అండ్ టీమ్ ఈ బయోపిక్ ను చేయబోతున్నట్లు తెలుస్తోంది. షార్ట్ ఫిలింస్ చేసిన ఓ యంగ్ న్యూ డైరక్టర్ ఈ ప్రాజెక్టుతో దర్శకుడిగా మారబోతున్నట్టు బోగట్టా. ఉదయ్ కిరణ్ అప్పట్లో పెద్దింటికి అల్లుడు కాబోయాడు. అయితే చివరి నిముషంలో ఎందుకో అది జరగలేదు.
అక్కడ నుండి అతనికి అవకాశాలు తగ్గిపోయాయని, కొందరు అతని ఆత్మహత్యకు పరోక్షంగా అది కూడా ఒక కారణం అంటూ ఉంటారు. ఆ కోణాన్ని సందీప్ కిషన్ టీం ఎలా చూపిస్తారో అనేది కూడా కీలకం కాబోతుంది. ఉదయ్ కిరణ్ పాత్రలో సందీప్ కిషన్ కనిపిస్తాడు. మిగిలిన నటుల్ని, సాంకేతిక నిపుణులనీ ఫైనల్ చేసే పనిలో ఉన్నారట.
సుందీప్ కిషన్ ప్రస్తుతం ఏ1 ఎక్సప్రెస్ అనే చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అతను హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. నువ్వు లేక నేను లేను చిత్రంతో యావేరేజ్ అందుకున్న సందీప్ వెంటనే తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ తో పెద్ద ప్లాప్ ని మూటగట్టుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇన్నేళ్ల స్నేహాన్ని విరోధంగా మార్చేసింది. ఇరు పార్టీల మధ్య…
Chennai Super Kings (CSK) have suffered a setback ahead of IPL 2027, as Ayush Mhatre…