Telugu

ఫాలోయర్స్ పిచ్చి… అందుకే ఈ ట్వీట్లు..!

తన మధ్య – అనుష్క మధ్య స్నేహం తప్ప మరొకటి లేదని, ఇలాంటి వార్తలపై స్పందించకూడదని తామిద్దరం నిర్ణయించుకున్నామని స్వయంగా ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కొద్దిసేపటికే మరోసారి సోషల్ మీడియాలో వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి ఓ కీలక ప్రకటన వెలువడింది. అందరికంటే ముందుగా సినిమా రివ్యూలను పెడుతూ సోషల్ మీడియాలో హంగామా చేసే ఉమైర్ సందు, ఈ సారి ప్రభాస్ – అనుష్కల సంబంధం గురించి ట్వీట్ చేసాడు.

అనుష్క అండ్ ప్రభాస్ లకు సంబంధించిన అత్యంత సన్నిహితురాలు చెప్పిన సమాచారం ప్రకారం… వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, మంచి సఖ్యతగా ఉన్న ఈ జంట డిసెంబర్ లో నిశ్చితార్ధం కూడా చేసుకోబోతోందని, అధికారికంగానే వీళ్ళు రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇటీవల ‘జై లవకుశ’ మరియు ‘స్పైడర్’ సినిమాల రివ్యూలను మూడు రోజుల ముందుగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హంగామా చేసిన ఉమైర్ నుండి లేటెస్ట్ ఈ ట్వీట్స్ వెలువడ్డాయి.

ADVERTISEMENT

అయితే చూసిన సినిమాల రివ్యూలనే సరిగా ఇవ్వలేని వ్యక్తి నుండి వచ్చిన ఈ సమాచారంలో వాస్తవం ఎంత ఉంది? అంటే అది ప్రశ్నార్ధకంగానే చెప్పవచ్చు. సోషల్ మీడియాలో తన ఫాలోయర్స్ ను పెంచుకునే లక్ష్యంలో భాగంగా… ఇటీవల తాను చేసుకుంటున్న అడ్వర్ టైజ్మెంట్స్ సరిగా వర్కౌట్ కాక, ఇలా అనుష్క – ప్రభాస్ ఎంగేజ్మెంట్… అంటూ సంచలన వార్తతో హంగామా చేయాలని భావిస్తున్నారో ఏమో గానీ, వీరిద్దరి పుకార్లకు శుభంకార్డు పడాలంటే… ఇద్దరిలో కనీసం ఎవరో ఒకరి వివాహం జరగాలేమో..! లేదంటే…!?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Epic Review: U.S. Premiere Report

#Epic Review: From 90s Magic to Epic Disappointment! Epic starts with 90s nostalgia but soon…

4 hours ago

Ghamasaan Review: Slow, Sincere Manhunt Drama

BOTTOM LINE Slow, Sincere Manhunt Drama PLATFORM ZEE5 RUNTIME 2Hrs 30Mins What Is the Show…

8 hours ago