Telugu

పవన్ కళ్యాణ్ కు చురక అంటించిన ఉండవల్లి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోటీ రాజకీయాలకు దూరంగా ఉన్నా రాజకీయ విశ్లేషణలకు దూరం కాలేదు. అడపాదడపా ఆయన ప్రెస్ మీట్లు పెడుతూ తన శత్రువైన చంద్రబాబు పై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో నిన్న ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీదకూడా ఒక చురక అంటించారు.

ADVERTISEMENT

“టీడీపీ బీజేపీ ఇప్పటికే మిత్రులు. స్పెషల్ స్టేటస్ ఇస్తే బీజేపీకు మద్దత్తు ఇవ్వడానికి సిద్ధం అని జగన్ ప్రకటించేసారు. అంటే బీజేపీకి మన పార్టీకి రాష్ట్రంలో పోటీ లేదన్నమాట. మరోవైపు జనసేన అనే పార్టీ వస్తుంది. ఆయన బలం ఉన్న చోట్లే పోటీ చేస్తా అంటున్నాడు. అసలు పోటీ చేస్తేనే కదా బలం ఎక్కడ ఉందొ ఎక్కడ లేదో తెలియడానికి,” అని ఉండవల్లి చమత్కరించారు.

మరోవైపు జగన్ పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని అరుణ కుమార్ అబిప్రాయపడ్డారు.జగన్ ముఖ్యమంత్రి అవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఉండవల్లి అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని విషయాలలో విపలం అయ్యారని, విభజన హామీలు నెరవేరలేదని నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2: Shoot Wrapped, But Rajini Is Back

Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…

11 minutes ago

గలగలా గోదావరి, బిరబిరా కృష్ణమ్మ…

దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…

17 minutes ago