Telugu

దేనివల్ల ఆందోళన తెలుసుకోగలిగితే…

అందరం ఎదో ఓ సందర్భంలో తీవ్ర ఆందోళన చెందుతుంటాము. నిజానికి మనుషులే కాదు పశుపక్ష్యాదులు కూడా ఆందోళన చెందుతుంటాయి. కానీ వాటి ఆందోళన మానవులు గుర్తించరు. ఎందుకంటే అవి మనకు అర్థమయ్యేలా చెప్పుకోలేవు కనుక! కానీ మనుషులకు కలిగే కోపం, భయం, ఆందోళన, కష్టం, బాధ, సంతోషం వంటివన్నీ మాటలు, చేతల ద్వారా వ్యక్తం చేయగలరు. కనుక సులువుగా అందరూ గుర్తించగలరు.

సాటి మనుషులు ఎందుకు సంతోషంగా ఉన్నారో చెప్పడం చాలా సులువు. కానీ ఆందోళనగా ఎందుకున్నారో చెప్పడమే కష్టం. ఎందుకంటే, ఆరోగ్యం, కుటుంబం, ఆర్ధిక సమస్యలు, పరీక్షలు, నిరుద్యోగం, ఉద్యోగాలలో ఒత్తిళ్ళు లేదా జీవితంలో ఎదురుదెబ్బలు, వైఫల్యాలు… ఇలా అనేక కారణాలు ఉంటాయి. ప్రతీ ఒక్కరూ తమ భయాలకు, ఆందోళనకి కారణాలు బయటకు చెప్పకపోవచ్చు. కనుక కొన్నిసార్లు వారంతట వారు చెపితే తప్ప వారి ఆందోళన అర్థం చేసుకోలేము.

ADVERTISEMENT

కానీ ఈ ఆందోళనకి కారణం ఎవరికి వారికి బాగా తెలుసు. కనుక అది పరిష్కరించుకోగల సమస్యేనా కాదా? సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయంలో మనకి తోడ్పడగలవారు ఎవరున్నారు? అసలు ఇది నిజంగానే సమస్యా లేక సమస్య అని మనం భావిస్తూ ఆందోళన చెండుతున్నామా? అని ఎవరికి వారు ఆలోచించి తెలుసుకోవాలి.

సాధారణంగా చాలా మంది సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్య గురించే ఆలోచిస్తూ ఆందోళన చెందుతుంటారు. కానీ సమస్య గురించి ఎన్ని గంటలు, రోజులు, నెలలు ఆలోచించినా అది పరిష్కారం కాదని, తమ కోసం అది అక్కడే ఉంటుందని గ్రహించరు.

కనుక ఆలోచించాల్సింది సమస్య గురించి కాదు… దాని పరిష్కరమార్గాలు, ప్రత్యామ్నాయాల గురించి. అప్పుడే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దాని నుంచి మనం బయటపడగలము. కొన్నిసార్లు మనం చేయలేమనుకున్న పనులు చేయాల్సి రావడం వలన, మనం చేయగల పనులు చేయలేమనే భయం వలన కూడా ఆందోళన మొదలవుతుంది.

మరికొన్ని సమస్యలకి పరిష్కారమే ఉండకపోవచ్చు. పరీక్షలలో పాస్ అవడం, ఉద్యోగం, ఉపాధి సంపాదించుకోవడం పరిష్కరించుకోగల సమస్యలు కాగా మూడో దశ క్యాన్సర్, వృద్ధాప్యం వంటివి పరిష్కారం లేని సమస్యలు. అప్పుడు ఆలోచించాల్సింది పరిష్కారం గురించి కాదు ఉపశమనం.. దానికి మార్గాల గురించి ఆలోచించాలి.

కొన్నిసార్లు మన భయాందోళనలకు కారణం కూడా తెలియకపోవచ్చు. మనసులో నిక్షిప్తమైన కొన్ని చేదు అనుభవాలు, ప్రమాదాలు, ఆత్మీయుల ఎడబాటు లేదా మరణాలు వంటివి కారణం కావచ్చు. ఇటువంటి సమస్యల వలన ఏర్పడే ఆందోళన నుంచి కుటుంబ సభ్యుల సహకారంతో, అవసరమైతే సైకియాట్రిస్ట్ సాయంతో సులువుగా బయటపడవచ్చు.

కానీ మన సమాజంలో కాలికి లేదా చేతికి దెబ్బ తగిలితే అందరికీ చెప్పుకొని సానుభూతి పొందేందుకు ఇష్టపడతారు. అవసరమైతే వైద్యుడి వద్దకు కూడా వెళ్ళి చికిత్స చేయించుకుంటారు.

కానీ మనసులో భయం, ఆందోళన, మానసిక సమస్యల గురించి ఎవరికీ చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇక సైకియాట్రిస్ట్ వద్దకు వెళ్ళే ఆలోచన కూడా చేయరు. ఎందుకంటే సమాజం తమని పిచ్చివాడిగా ముద్ర వేసేస్తుందనే మరో భయంతో!

అసలు ఆందోళన ఎందుకు కలుగుతుంది?అని ఆలోచిస్తే భయం వలన అని చెప్పుకోవచ్చు. భయం దేని వల్ల అంటే చిన్నా లేదా పెద్ద సమస్య వలన. కానీ సమస్య వస్తే ఏం చేయాలి?అని ముందే చెప్పుకున్నాము కదా?

ఓ సమస్యని మనసులో పెట్టుకొని ఆందోళన చెందడం వలన ఆరోగ్యం కూడా పాడవుతుంది. కనుక సమస్య మూలాలు వెతికి పట్టుకొని పరిష్కారం, ప్రత్యామ్నాయాలు, ఉపశమనం కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వైసీపీ చేతికి మట్టి అంటకుండా మనమే కానిచ్చేదామా?

ఎన్నికలలో టీడీపితో పొత్తుకు జనసేనలో కొందరు నేతలు, బయట కొందరు శ్రేయోభిలాషులు కూడా వ్యతిరేకించారు. కానీ గత ఎన్నికలలో ఎదురైన…

25 minutes ago

The Paradise Gets Positive Responses

Unlike the usual approach seen in recent times, the makers of The Paradise have chosen…

54 minutes ago