
తొలి ట్రైలర్ ఆశించిన టాక్ ను సొంతం చేసుకోకపోవడంతో, సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ వలన కూడా పెద్దగా ప్రయోజనం లేదనే చెప్పాలి. ‘ఖైదీ నంబరు 150’ చిత్రంలో ‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా… కాదని బలవంతం చేస్తే కోస్తా…’ అనే మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ ను ఇమిటేట్ చేస్తూ ప్రారంభమైన ఈ ట్రైలర్ లో ప్రేక్షకులకు కావాల్సిన వినోదం మిస్ కావడంతో, అల్లరి నరేష్ బాటలోనే సునీల్ కూడా పయనిస్తాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
‘ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై సునీల్ భారీ ఆశలనే పెట్టుకున్నాడు. అయితే వాటిని పరిపూర్ణం చేసే విధంగా అయితే ట్రైలర్ కనిపించడం లేదు. తన ప్రేమను గెలుచుకోవడానికి హీరోయిన్ తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్ ను ఎలా మెప్పించాడు, అలాగే ప్రకాష్ రాజ్ లక్ష్యం చేరుకోవడానికి హీరో ఎలా దోహదపడ్డాడు… అనేదే చిత్ర కధ. తెలుగులో ఇలాంటి ఎన్నో… ఎన్నెన్నో…! ఇదంతా వినోదభరితంగా సిల్వర్ స్క్రీన్ పై ఉంటేనే గట్టెక్కుతారు.
Pawan Kalyan’s birthday celebrations are getting another update from the team of OG. Director Sujeeth…
Toxic is slowing down at the box office, and Tuesday’s numbers have added to the…