Telugu

కేంద్రమంత్రి సుజనా చౌదరికి మరో దెబ్బ!

టీడీపీ సీనియర్ నేత, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి ఇప్పటికే పలు ఆరోపణలతో సతమతమవుతున్నారు. అయితే తాజాగా సుజనాకు తన కొడుకు రూపంలో మరో చిక్కు వచ్చి పడింది. శుక్రవారం నాడు రాత్రి హైదరాబాద్ లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న కొడుకు కార్తీక్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అర్ధరాత్రి సమయంలో కొంతమంది మిత్రులతో కలిసి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద ప్రత్యక్షమైన కార్తీక్… పంజాగుట్టకు దారి తీసే రోడ్డు మీదుగా కారు రేసింగులకు దిగినట్లు సమాచారం. ఈ రేసింగుల్లో సుజనా యూనివర్సల్ పేరిట రిజిస్టర్ అయిన ‘ఏపీ 09 సీవీ 9699’ కారుతో కార్తీక్ అక్కడికి రాగా… మరో మూడు కార్లు, పది బైకులపై అతడి మిత్రులు వచ్చారు.

ఆ సమయంలో రోడ్లపై 100 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో రయ్యిమంటూ దూసుకెళుతున్న కార్లను చూసిన నగర వాసులు బెంబేలెత్తిపోయి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్ ఆర్ నగర్, మహంకాళీ స్టేషన్ పోలీసులు మెరుపు దాడి చేసి కార్తీక్ సహా మిగిలిన వారిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో కార్తీక్ పై ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణ కింద కేసు నమోదు చేశారు. సహజంగా ఈ ఆరోపణల కింద అదుపులోకి తీసుకున్న నిందితులకు కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత పోలీసులు వదిలేస్తున్నారు. మరి సుజనా తనయుడి ఉదంతంలో ఏం జరుగుతుందో చూడాలి.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, శరణ్య… బాధితులు ఎవరు?

ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…

15 minutes ago

175/175 ఓ భ్రమ… ఈసారి మనమే మరో భ్రమ?

కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…

22 minutes ago