
సగటు ప్రేక్షకుడి మాదిరి కాగితాలు ఎగరేస్తూ., ఉత్సాహంతో కేరింతలు కొడుతూ తానూ ఒక సెలబ్రెటీని అన్న ఆలోచన కూడా వదిలేసి పూర్తిగా అభిమానుల కోణంలో సినిమాను వీక్షిస్తున్న ఉపాసన వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఎంతటి సెలబ్రెటీ హోదా ఉన్నప్పటికీనూ కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయడంలో తప్పులేదంటున్నారు నెటిజన్స్.
తెలుగు సినిమా ప్రతిష్టను ఆకాశానికెత్తిన ప్రతిష్టాత్మక మూవీలో తన భర్త రామ్ చరణ్ ను చూసిన ఉపాసన ఆనందంలో మునిగిపోయింది. అందులోను ‘అల్లూరి’ పాత్ర ఇంపాక్ట్ ఏమో కానీ రామ్ చరణ్ కూడా ఆ పాత్రలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. సినిమా కూడా సూపర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇరు కంపౌండ్ల అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఈ ఆనందానికి తామేమి అతీతులం కాదన్నా చందంగా ఉపాసన తాన ఫీలింగ్స్ ను వ్యక్తపరిచింది. ప్రివ్యూ షో కి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారని టాక్. ఎన్టీఆర్ కూడా కుటుంబ సమేతంగా మహేష్ బాబు ఏఎంబి థియేటర్లో సినిమా చూసి., సినిమా సూపర్ అనే విధంగా ‘థంబ్స్ అప్’ అంటూ చూపించారు.
కూటమి పొత్తులో భాగమైన టీడీపీ , జనసేన పార్టీల మధ్య ఏర్పడిన రాజకీయ బంధం ఎన్నికలు వచ్చేసరికి సోషల్ మీడియాలో…
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has turned the spotlight on the YSR Congress Party…