
అయితే ట్రేడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఓ ఇద్దరు నిర్మాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో రాజమౌళి ఉన్నట్లుగా తెలుస్తోంది. అవును… ‘బాహుబలి’ సినిమాకు ముందు మెగా ప్రొడ్యూసర్ డివివి దానయ్యకు మరియు కేఎల్ నారాయణకు చెరో సినిమా చేస్తానని కమిట్ అయ్యారు జక్కన్న. దీంతో తొలుత డివివి దానయ్య నిర్మాతగా ఓ సినిమాను చేసిన తర్వాత, మహేష్ బాబు హీరోగా కేఎల్ నారాయణకు మరో సినిమా చేయనున్నారనేది లేటెస్ట్ న్యూస్.
గత ఏడేళ్ళుగా కేవలం మెగా హీరోలతో మాత్రమే సినిమాలు తీస్తూ వస్తున్న దానయ్య, ఈ ఏడాదిలో నానితో ‘నిన్ను కోరి,’ మహేష్ తో ‘భరత్ అనే నేను’ సినిమాలు నిర్మిస్తున్నారు. దీంతో దానయ్య – జక్కన్నల సినిమాలో హీరో ఎవరన్న విషయం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో మెగా హీరో ఉంటారా? లేక ఇతర హీరోలకు ఆ అవకాశం దక్కుతుందా? ఏదైనా గానీ జక్కన్న చేతిలోనే ఉందన్నది స్పష్టం. అయితే ఇప్పటివరకు హీరో గానీ, సబ్జెక్ట్ గానీ… ఏం ఫైనల్ కాలేదన్నది సమాచారం.
“బాహుబలి 2” తర్వాత రాజమౌళి ఎక్కడో ఉన్నారు. ఒకప్పుడు రాజమౌళి సినిమా అంటే అది ప్రాంతీయ సమాచారం మాత్రమే! కానీ, ప్రస్తుతం రాజమౌళి సినిమా అంటే… అది నేషనల్ మీడియాలో హాట్ టాపిక్. మరి ఆ స్థాయికి వెళ్ళిన రాజమౌళి తదుపరి సినిమాపై ఉత్కంఠ కొనసాగుతోంది. జక్కన్న పెరిగిన రేంజ్ కు చివరి నిముషంలో ‘ఏది ఏమైనా జరగొచ్చు’ అన్న టాక్ కూడా ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఏదైనా గానీ, జక్కన్న అధికారికంగా వెల్లడించే వరకు ఆగాల్సిందే!
Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…
BOTTOM LINE Thin Story, Patchy Laughs RATING 2/5 Story, Screenplay, Director: Venu Gopal Reddy Cast:…