
తనకు తెలిసినంత వరకు మోడీ దేశంలోనే ఒక హానెస్ట్ పర్సన్ అని, తానేమీ బిజెపి నాయకుడిని కాదు, ఉన్నదేదో చెప్తాను, పాకిస్తాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ అమ్మకు చీర పెట్టి, కాళ్ళకు దండం పెట్టిన మోడీ, మన దేశ రక్షణ కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఎందుకు విభేదిస్తారని, ఎంతసేపు మన సైనికులే చనిపోవాలా? అంటూ ప్రసంగిస్తున్న సమయంలో… కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కల్పించుకుని పోసాని వ్యాఖ్యలతో తీవ్రంగా విభేదించారు. అలాగే సీపీఐ నారాయణ కూడా పెదవి విప్పారు. ఇలా గందరగోళంగా మారుతున్న తరుణంలో… యాంకర్ అందరినీ చల్లార్చగా… పోసాని ఈ సందర్భంగా ప్రత్యర్ధి నాయకులపై సెటైర్లు వేసారు.
‘మీరు మాట్లాడినపుడు నేను మాట్లాడలేదు, అలా మాట్లాడడానికి నేనేమి పిచ్చి కుక్క కాదు, నేను చదువుకున్న వాడ్ని, ఎస్… నాకు మోడీ అంటే ఇష్టం… నా ఇష్టాన్ని కాదనే హక్కు ఎవడికీ లేదు… అంటున్న తరుణంలో వీహెచ్ మళ్ళీ కల్పించుకోవడంతో… పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. వీహెచ్ సీట్లో నుండి లెగుస్తూ ఏవో మాట్లాడుతుండగా… సహనం కోల్పోయిన పోసాని… నీయమ్మా… అంటూ తిట్టడం లైవ్ లో స్పష్టంగా వినపడింది. దీంతో ఒక్కసారిగా అవాక్కైన సదరు టెలివిజన్ ‘లైవ్’ను కట్ చేసింది. సహజంగానే పోసాని ‘షార్ట్ టెంపర్’ అన్న టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. దానికి అనుగుణంగానే ఈ ‘లైవ్’ కార్యక్రమంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…