Telugu

దిశకు దిల్ రాజు అంకితం!

మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వివి వినాయక్‌. టాలీవుడ్‌ టాప్‌ హీరోలందరినీ డైరెక్ట్ చేసిన ఈ క్రేజీ దర్శకుడు, కొంత కాలంగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. వరుస ఫెయిల్యూర్స్‌తో వినాయక్‌ కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది.

ఈ తరుణంలో హీరోగా అవతారం ఎత్తనున్నాడు వినాయక్. దిల్‌ రాజు నిర్మాతగా శంకర్‌ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన నరసింహారావు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు శీనయ్య అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అక్టోబర్ లో ముహూర్తం జరుపుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది.

ADVERTISEMENT

రేప్ కు గురయ్యి ఆ తరువాత హత్య చెయ్యబడ్డ తన కూతురి మృగాళ్లపై పగతీర్చునే తండ్రి పాత్రలో వినాయక్ కనిపించబోతున్నాడు. దీనితో ఈ చిత్రాన్ని దిశకు అంకితం ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. దిశ ఘటనకు సంబందించిన కొన్ని విషయాలతో స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చెయ్యబోతున్నారట.

ఈ సినిమాలో వినాయక్‌కు ప్రతినాయకుడిగా టాలీవుడ్‌ యంగ్ హీరో నటించనున్నాడు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత విలన్‌గా, సపొర్టింగ్‌ రోల్స్‌లోనూ ఆకట్టుకుంటున్న నవీన్‌ చంద్ర ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడు. శ్రియ హీరోయిన్ గా కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramayana Buzz: Where Is Kajal Aggarwal?

Kajal Aggarwal had earlier said that she was playing a small role in Ramayana, but…

6 minutes ago

Jogi Ramesh Daughter-in-Law’s Accident Sparks Suspicion

A car accident involving Meghana, daughter-in-law of former YSRCP minister Jogi Ramesh, has raised concerns…

35 minutes ago