
2026 ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇంటర్నెట్లో హల్చల్ చేసిన ట్యాగ్ ‘2026 ఈస్ ది న్యూ 2016’! 2016 లో విరాట్ కోహ్లీ ఫామ్ మరియు ఆటతీరు ఏ స్థాయిలో ఉన్నదో అందరికి తెలిసిందే. 2024, 2025 కొన్ని నిలకడలేని ప్రదర్శనల వలన జట్టులో తన స్థానం మరియు తన ఫామ్ పై ప్రశ్నలు లేవనెత్తిన వేళ, 2025 చివరిలో విరాట్ మళ్ళీ తన 2016 వర్షన్ ను ఒక గ్లిమ్స్ ఇచ్చాడంటూ ఫాన్స్ ఖుషి అయ్యారు.
ఇక, ఐపీఎల్ కు ఇంకా కొద్ది రోజులే ఉంది అనుకోగా, ఈలోపు బెంగళూరు జట్టు అభిమానులు వరుసగా ఆర్.సి.బీ జట్టు రెండవ కప్పును సాధించబోతుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టటంతో, అభిమానులు మళ్ళీ మనం 2016 విరాట్ కోహ్లీ ను చూడబోతున్నాం అంటూ హడావిడి చేసారు.
కట్ చేస్తే, విరాట్ కోహ్లీ ప్రతి ఏటా ఐపీఎల్ లో అదరగొట్టేలాగే 2026 ఐపీఎల్ లో కూడా నిలకడ తో పాటు అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తూ ఫాన్స్ ఆశలను అడియాశలు చేయలేదు. కానీ, 2016 లో విరాట్ కోహ్లీ కు జరిగింది, 2026 లో మరొక ఆటగాడికి జరిగింది అనటం అతిశయోక్తి కాదు.
అది, మరెవరో కాదు.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా జపిస్తున్న పదం, ప్రతి క్రికెట్ అభిమాని నోట వినిపించే పేరు ‘వైభవ్ సూర్యవంశీ’! ఈ 15 ఏళ్ళ పిల్లాడు చేస్తున్న విధ్వంసాన్ని చూసి అంతర్జాతీయ క్రికెట్ లెజెండ్స్ ఊహకే అందని ఆటతీరుతో ప్రస్తుతం ఐపీఎల్ కే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు వైభవ్.
నిన్న జరిగిన క్వాలిఫయర్-2 లో కూడా మరొక మ్యాచ్ డిఫైనింగ్ 90 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ కు డిఫెండ్ చేసుకోగలిగే స్కోరు ఇవ్వటంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించాడు వైభవ్. గత 4 మ్యాచ్లలో 3వ సారి 90+ స్కోరు మీద తన వికెట్ ను చేజార్చుకుని 3 సెంచరీలను మిస్ అయ్యాడు ఈ చిచ్చరపిడుగు.
మొత్తం సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన వైభవ్ ఏకంగా 776 పరుగులు చేయటమే చాలా పెద్ద రికార్డ్ అనుకుంటే, ఆ 776 పరుగులను 230+ స్ట్రైక్ రేట్ తో అందుకుని, చరిత్రలో మునుపెన్నడూ లేని రికార్డును సృష్టించాడు సూర్యవంశీ. ఒక సీజన్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా కూడా వైభవ్ 72 సిక్సర్లతో తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ సీజన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు మొత్తం వైభవ్ బ్యాటింగ్ మీద ఆధారపడ్డారనేది జనమెరిగిన సత్యం. ఓపెనర్లలో వైభవ్ కనుక పెద్ద స్కోరు కొట్టకుండానే వెనుతిరిగితే రాయల్స్ జట్టు కనీసం పార్-స్కోరు కూడా అందుకోలేకపోయారు. కొన్ని మ్యాచ్లలో వైభవ్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చినప్పటికీ, వారి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రన్స్ చేయలేక జట్టును కష్టాల్లో పడేసిన సంఘంటనలెన్నో ఉన్నాయి.
నిన్న క్వాలిఫయర్-2 లో రాజస్థాన్ జట్టు ఓటమి చెందిన తరువాత మరొకసారి విరాట్ 2016 సీజన్ వెలుగులోకి వచ్చింది. ఏ జట్టు కూడా ఒక బ్యాటర్ లేదా బౌలర్ మీద కంప్లీట్ గా ఆధార పడితే వారు ట్రోఫీ నెగ్గలేరు అని మరోసారి నిరూపించబడింది.
2016 ఐపీల్ సీజన్ లో కూడా కోహ్లీ మొత్తం 973 రన్స్ కొట్టి ఆర్సీబీ ని ఒంటి చేత్తో ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అలాగే ఈ 2026 ఐపీల్ సీజన్ లో వైభవ్ 776 రన్స్ బాది తన ఆర్ఆర్ జట్టును క్వాలిఫైర్స్ వరకు పట్టుకెళ్ళాడు. కానీ నాడు 2016 లో విరాట్ ఫైనల్స్ లో ఎదురుకున్న హార్ట్-బ్రేకింగ్ ఓటమి, వైభవ్ ప్లే-ఆప్స్ లోనే ఎదురుకోవటం ఒక్కటే తేడా. మరి రేపు జరిగే ఫైనల్స్ లో ఏ జట్టు ట్రోఫీ అందుకుంటుందనుకుంటున్నారు..?
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…