
ఓ పక్కన తన చిన్నల్లుడుని హీరోగా పరిచయం చేసే పనిలో మెగాస్టార్ చిరంజీవి ఉండగా, మరో పక్కన పవర్ స్టార్ అండదండలతో సాయి సోదరుడు వైష్ణవ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. పవన్ ఇచ్చిన సూచనలతో ప్రస్తుతం వైష్ణవ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడని, అలాగే నటన, డ్యాన్స్ లలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా, కొన్ని కధలు కూడా వింటున్నట్లుగా తెలుస్తోంది. ఫైనల్ గా పవర్ స్టార్ ‘ఓకే’ చేసిన స్క్రిప్ట్ తో టాలీవుడ్ తెరపై మెరవడానికి వైష్ణవ్ ఎదురుచూస్తున్నాడు.
చిరు చిన్నల్లుడు, సాయి సోదరుడు కూడా ఎంట్రీ ఇస్తే మెగా హీరోల సంఖ్య 8కి పెరుగుతుంది. అయితే ఇందులో కూడా చిరంజీవి వర్గం మరియు పవన్ కళ్యాణ్ వర్గంగా పిలవబడే హీరోలు ఉండడం విశేషం. అయితే ఎంతమంది వచ్చినా… మెగా వృక్షాన్ని స్థాపించిన ఘనత కొణిదెల శివశంకరప్రసాద్ కే చెందుతుంది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…