
సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై సినిమా రూపొందుతుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. రేపటి నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ను పూరితో పాటు కోల్కతా, గ్యాంగ్టక్ ప్రాంతాల్లో జరపనున్నారు.
20 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. హీరో, హీరోయిన్లతో పాటు బ్రహ్మాజీ మీద కూడా కొన్ని కీలక సీన్లు షూట్ చెయ్యబోతున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నాయి. అయితే ఇప్పటివరకూ నిర్మాతలు ఈ సినిమా రిలీజ్ ప్లాన్ ప్రకటించలేదు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తొలి చిత్రంలో వైష్ణవ తేజ్ ఒక మత్స్యకారుడిగా కనిపిస్తాడని వదంతులు వినిపిస్తున్నాయి. నిజమైతే గనుక మొదటి సినిమాకే కొంచెం కఠినతరమైన పాత్రను ఎన్నుకున్నాడని చెప్పవచ్చు.
Prabhas turned a casual conversation with Prashanth Neel into a fun moment, and fans got…
Ayushmann Khurrana and Sara Ali Khan’s Udta Teer has arrived in theatres on October 23,…