
ఈ పాటని సామజవరాగమన వంటి పాటతో యువతను ఉర్రూతలూగించిన సిద్ శ్రీరామ్ పాడాడు. మే 15న తమ సినిమా విడుదల అవుతుందని కూడా దిల్ రాజు ఇప్పటికే కంఫర్మ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేతా థామస్, అంజలి, అనన్య (మల్లేశం ఫేమ్) నటిస్తున్నారు. దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తాడు.
ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.
ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ. పవన్ కళ్యాణ్ వయసు, ఇమేజ్ ని బట్టి కథలో మార్పులు చేర్పులు చేశారట. ఈ సినిమా కాకుండా పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నారు. ఆ సినిమా కూడా ఇదే ఏడాది రాబోతున్నట్టు సమాచారం.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…