
ఈ క్రమంలో మొట్టమొదటిగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిన్నటి నుండి ప్రారంభమైన శాసనసభలో అధికార పక్షం, సొంత పక్షం వైపు కాకుండా వేరే గా కూర్చోవడం మొదలు పెట్టారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వంశీ మాట్లాడుతూ.. టీడీపీలో ఉండలేకపోతున్నానని.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్ తమ్మినేనిని కోరారు.
అయితే ఇందుకు స్పందించిన స్పీకర్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చన్నారు. గతంలో ఇదే స్పీకర్ తెలుగుదేశం సభ్యులు తమలో తాము ప్లేసు మారితే ఒప్పుకోకుండా శాసనసభలో హడావిడి చెయ్యడం అందరికీ గుర్తుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో కొత్త రకం ఫిరాయింపులకు రాష్ట్ర శాసనసభలో రాజముద్ర వేసినట్టు అయ్యింది.
ఇది ఇలా ఉంటే వంశీ కొత్త నాయకుడికి సరికొత్త స్వామిభక్తి చూపించడం మొదలు పెట్టారు. శాసనసభలో జగన్ ని పొగుడుతూ, చంద్రబాబుని, లోకేష్ ని తిట్టడం మొదలు పెట్టారు. దానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరస్ పాడుతున్నారు. ఏది ఏమైనా రెండు తెలుగురాష్ట్రాలలో ఫిరాయింపులు అనేవి ఆగేలా కనిపించడం లేదు.
The Telugu film industry was left shocked after a tragic road accident in Hyderabad claimed…
Rohith Nara has always been recognized for his penchant for unique scripts and diverse character…