
మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మొత్తానికి ప్రీ-టీజర్ అదిరిపోయింది అనే చెప్పుకోవాలి. 14రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న వాల్మీకికి తమిళ సినిమా జిగర్తాండ మాతృక. సెప్టెంబర్ 6వ తారీఖున విడుదలకు సిద్ధం చేస్తున్నారు. దర్శకుడితో స్పర్ధల కారణంగా దేవీశ్రీప్రసాద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ వచ్చి చేరారు. సినిమా విడుదలకు నెలల ముందే సినిమా రెడీ అయిపోతుందట.
అయితే ఆగస్టులో బాక్స్ ఆఫీసు వద్ద ఖాళీ లేక సెప్టెంబరులో సినిమా విడుదల చేస్తున్నారు. ముందే షూటింగ్ పూర్తి కానుండడంతో పోస్ట్ ప్రొడక్షన్, పుబ్లిసిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టబోతున్నారట. ఈ సినిమా మొదలు కాకముందే వివాదాలలో చిక్కుకుంది. గ్యాంగ్‌స్టర్ మూవీకి వాల్మీకి పేరు ఎలా పెడతారంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ సినిమా షూటింగ్ మొదలుకాక ముందే వార్తల్లోకి ఎక్కింది. ఆ తరవాత ఈ ఆందోళన సద్దుమణిగింది.
Kiara Advani has once again become a major topic of discussion on social media. While…
Aarti Chikara is redefining summer glamour with her latest poolside revelation. Draped in a vibrant…