“వంగవీటి” సినిమాతో వర్మ కెరీర్ “సమాప్తం”

“శివ” సినిమాతో ప్రారంభమైన రామ్ గోపాల్ వర్మ సినీ జీవితం “వంగవీటి” సినిమాతో ముగియనుంది. అవును… ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న “వంగవీటి” సినిమానే వర్మ చివరి సినిమా. ఈ విషయాన్ని వర్మ స్వయంగా ట్వీట్ చేయలేదు గానీ, ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు సదరు సమాచారాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. అయితే ‘వంగవీటి’తో ముగించడం అనేది తెలుగు వరకే భాష వరకే పరిమితమవుతుందా? లేక బాలీవుడ్ సినిమాలకు కూడా ‘శుభంకార్డు’ వేసేస్తారా? అన్న విషయం తేలాల్సి ఉంది.

వెండితెరపై దృష్టి తగ్గించి, బహుశా తన ‘ఆర్జీవి టాకీస్’పై ఫోకస్ చేసేందుకు వర్మ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇటీవల “సింగిల్ ఎక్స్” పేరుతో ఓ ఎరోటిక్ పోస్టర్ ను విడుదల చేసిన వర్మ, మున్ముందు ఆర్జీవి టాకీస్ లో మరిన్ని సినిమాలు విడుదల అవుతాయని స్పష్టం చేసారు. దీంతో ఇక, వెండితెరకు వర్మ స్వస్తి చెప్పినట్లే భావించవచ్చని ట్రేడ్ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి.

ADVERTISEMENT

ఇటీవల వర్మ దర్శకత్వం వహించిన సినిమాలలో ఒక్క “కిల్లింగ్ వీరప్పన్” మినహా మరే చిత్రమూ వర్మ స్థాయికి తగిన విధంగా లేదని సినీ విమర్శకులు తేల్చిన అంశం. మరోవైపు వర్మ సినిమాలంటే గతంలో ఉన్న ఆసక్తి ఆడియెన్స్ లో కూడా రానూ రానూ సన్నగిల్లుతోంది. దీంతో వర్మ తీసుకున్న నిర్ణయం సముచితమైనదేనని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక, వర్మ బారి నుండి సినీ ప్రేక్షకులు బతికి పోయినట్లే అన్న సెటైర్లు కూడా నెటిజన్లు వేస్తున్నారు.

Share
Published by

Recent Posts

తెలంగాణలో మైండ్ గేమ్ పాలటిక్స్.?

తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…

13 minutes ago

జగన్‌ వార్నింగ్ ఇస్తే చంద్రబాబు దిగొచ్చారటగా?

అవును! నిజమే! జగన్‌ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…

17 minutes ago