
కానీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ని నిత్యం బూతులు తిడుతుండే కొడాలి నానితో వంగవీటి రాధ రాసుకుపూసుకు తిరుగుతుండటం టిడిపికి, ముఖ్యంగా కృష్ణా జిల్లా టిడిపి నేతలకి చాలా ఇబ్బందికరంగానే ఉంది. కానీ జిల్లా రాజకీయాలలో వంగవీటి కుటుంబానికి మంచి పట్టు ఉన్నందున ఎవరూ అభ్యంతరం చెప్పలేకపోతున్నారు.
వచ్చే ఎన్నికలలో గుడివాడలో కొడాలి నానిని ఎట్టి పరిస్థితులలో ఓడించాలని టిడిపి చాలా పట్టుదలగా ఉంది. కనుక గుడివాడ నుంచి కొడాలి స్నేహితుడు వంగవీటి రాధనే బరిలో దింపితే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇద్దరికీ ఇబ్బందికరంగానే ఉంటుంది కనుక స్నేహితుడిపై పోటీ చేయడానికి వంగవీటి అంగీకరిస్తారా లేదో తెలీదు. కానీ అంగీకరిస్తే అప్పుడు ఇద్దరూ స్నేహం ముఖ్యమా… లేదా పార్టీలు, పదవులు ముఖ్యమా అని తేల్చుకోకతప్పదు. పార్టీలు, పదవులే ముఖ్యమని భావిస్తే వచ్చే ఎన్నికలలో గుడివాడలో చాలా పసందైన పోటీ ఉంటుంది.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…